దారుణం: ప్రేమిస్తోందని కూతురిని గొలుసులతో కట్టేసిన తండ్రి

Bareilly: Man ‘ties up 17-yr-old daughter with chain’ for refusing to end relationship with youth
Highlights

ఓ యువకుడితో తన కూతురు  చనువుగా ఉంటుందని భావించిన తండ్రి  ఆమెను బయటకు అడుగుపెట్టకుండా ఉండేందుకుగాను  17 ఏళ్ల బాలికను గొలుసులతో కట్టేశాడు.అయితే ఇంట్లో నుండి తప్పించుకొన్న ఆ బాలిక  తల్లిదండ్రులపై స్నేహితుడి సహాయంతో  పోలీసులకు ఫిర్యాదు చేసింది.


లక్నో:ఓ యువకుడితో తన కూతురు  చనువుగా ఉంటుందని భావించిన తండ్రి  ఆమెను బయటకు అడుగుపెట్టకుండా ఉండేందుకుగాను  17 ఏళ్ల బాలికను గొలుసులతో కట్టేశాడు. అయితే ఇంట్లో నుండి తప్పించుకొన్న ఆ బాలిక  తల్లిదండ్రులపై స్నేహితుడి సహాయంతో  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలోని మీర్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకొంది.తాను ఓ యువకుడిని ప్రేమించడం తన కుటుంబసభ్యులకు  నచ్చలేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. తాను ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండేందుకు గొలుసులతో కట్టేశారని బాధితురాలు పోలీసులకు ఆరోపించారు.

 అర్థరాత్రి ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో తప్పించుకుని వచ్చి పోలీస్‌లను ఆశ్రయించినట్లు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తండ్రిని శనివారం అరెస్ట్‌ చేశారు.

మైనర్‌ బాలికను అక్రమంగా నిర్భందించారని ఐపీసీ సెక్షన్‌ 342 ప్రకారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలికను మహిళ కానిస్టేబుల్‌ సహాయంతో వైద్య సేవలు అందిస్తున్నారు. 

ఆ బాలిక  మేజర్‌ అయ్యే వరకు బాలిక సంరక్షణ కేంద్రంలో ఉంటుందని అధికారులు తెలిపారు. బాలిక ఆరోపణలపై కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని బరేలీ సూపరింటెండెంట్ సతీష్‌ కుమార్‌ వెల్లడించారు.

loader