Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకుల సమ్మె.. ఈ నెల జీతాలు కష్టమే..!

ఈ నెల 30,31న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

Bank unions to go on two-day nationwide strike; salary withdrawal, ATM transactions to be affected

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 30, 31వ తేదీల్లో  సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో పనిచేస్తున్న దాదాపు 10లక్షల మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొననున్నారు. 48గంటల పాటు సాగే ఈ సమ్మెతో సామాన్యప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

నెలాఖరి వచ్చిందంటే.. చాలా మంది మధ్య తరగతి ప్రజలు నెల జీతం కోసం ఎదురుచూస్తుంటారు. దాదాపు 30, 31 తేదీల్లోనే చాలా కంపెనీలు జీతాలు అందిస్తుంటాయి. సరిగ్గా ఆ రెండు రోజుల్లోనే సమ్మె చేపడుతుండటంతో.. ఈ సారి జీతాలు అందజేయడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

కేవలం జీతాలలో జాప్యం మాత్రమే కాకుండా..ఎటీఎంలలో నగదు సమస్య కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గత నెల ఏటీఎంలలో కరెన్సీలేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఈ రెండు రోజుల సమస్యతో మళ్లీ అదే రిపీట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సమ్మెలో ఏటీఎంలలో పనిచేసే సెక్యురిటీ గార్డులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఈ నెపథ్యంలో ఈ రెండు రోజులు మళ్లీ దేశ ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పవు.

వేతన సవరణను సమీక్షించాలని, తమకు జీతాలు పెంచాలని కోరుతూ బ్యాంకు అధికారులు ఈ సమ్మె చేపడుతున్నారు. ఉద్యోగుల వేతన సవరణ కేవలం 2శాతం మాత్రమే చేశారని, 15శాతం చేయాలనే డిమాండ్లతో వీరు ఈ సమ్మెకు పూనుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios