బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో రూ.3వేల కోట్ల కుంభకోణం, ఛైర్మన్ అరెస్ట్

bank of maharastra chairman arrest
Highlights

చీటింగ్, పోర్జరీ కేసు నమోదు

మహారాష్ట్రలో మరో భారీ బ్యాంకు కుంభకోణం బైటపడింది. ఈ బ్యాంకులో  తీసుకున్న దాదాపు రూ.3వేల కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించకుండా  డీఎస్‌కే గ్రూపు ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ వ్యవహారంతో సంబంధమున్న బ్యాంకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  రవీంద్ర మరాఠే ను ఆర్థిక నేరాల వింగ్ అధికారులు అరెస్ట్ చేశారు.  

ఈ భారీ ఆర్థిక అవకతవకలో పాలుపంచుకున్న బ్యాంకు ఉన్నతాధికారులను విచారించిన ఈఓడబ్యూ అధికారులు మరికొంత మందిని కూడా అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ జోనల్ మేనేజర్ నిత్యానంద్ దేశ్ పాండే, మాజీ సీఎండీ సుశీల్ మునోత్, ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర కె గుప్తాలను  ఈ కేసుతో సంబంధమున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిపై చీటింగ్, ఫోర్జరీ నేరాల కింద కేసు దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

పుణే కేంద్రంగా గత 83 సంవత్సరాలుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇది దేశంలోని పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటిగా ఉంది.ఇలాంటి ప్రతిష్టాత్మక బ్యాంకులో ఇంత భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలకు బ్యాంకు అధికారులే  పాల్పడటంతో ఈఓడబ్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు.

ఇప్పటికే  4 వేల మంది ఇన్వెస్టర్లకు రూ.1,154 కోట్లు మోసం చేయడమే కాకుండా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి తీసుకున్న రూ.2,900 కోట్ల రుణాన్ని డీఎస్‌కే గ్రూప్ ఇతర మార్గాలకు మళ్లించింది. ఈ కేసులో పుణెకు చెందిన డీఎ కులకర్ని, అతని భార్య హేమంతిల పిబ్రవరిలోనే అరెస్ట్ చేసి చార్జిషీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డీఎస్‌ కులకర్ణి గ్రూప్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ సునీల్ గట్ పాండే లతో పాటు రాజీవ్ నేవాస్కర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

వీరిని విచారించిన పోలీసులు ఈ వ్యవహారంలో బ్యాంక్ ఛైర్మన్ లో పాటు ఇతర ఉన్నతాధికారుల హస్తం ఉందని గుర్తించారు. ఈ మోసపూరిత వ్యవహరంలో అధికారుల పాత్రపై సాక్ష్యాధాలు సంపాదించి తాజాగా వారందరిని అరెస్ట్ చేశారు. 
 

loader