Asianet News TeluguAsianet News Telugu

అకౌంట్ లో పొరపాటున కోట్లు పడ్డాయి.. వెంటనే డ్రాచేసి, ఎంజాయ్ చేసి.. చివరికి..

కేరళలో ఓ ఇద్దరు యువకుల అకౌంట్లో పొరపాటున 2 కోట్లు రూపాయలు జమఅయ్యాయి. వెంటనే వారు వాటితో జల్సాలు చేశారు. 

bank mistake Rs. 2 crores deposits two man account in kerala
Author
First Published Dec 26, 2022, 9:30 AM IST

కేరళ : ఒక అకౌంట్ లో పడాల్సిన డబ్బులు మరో అకౌంట్ లోకి పొరపాటున పడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో అక్కడక్కడా వెలుగుచూస్తున్నాయి. సాంకేతిక కారణాల వల్ల కూడా కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఆయా సందర్భాలలో… సదరు అకౌంట్ హోల్డర్ చూసుకునేసరికి డబ్బులు పడిన సంగతి తెలిసి బ్యాంకులు బ్లాక్ చేయడం, లేదంటే డ్రా చేసుకుంటే వారి దగ్గర నుంచి వసూలు చేయడం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి కేరళలోని త్రిసూర్ లో ఇటీవల చోటు చేసుకుంది. అక్కడే ఒక బ్యాంకు నుంచి  ఒప్పో ఇద్దరు యువకుల  అకౌంట్లో  పొరపాటున రూ.2.44కోట్లు వచ్చి పడ్డాయి. 

అది చూసిన వెంటనే వారు బ్యాంకుకు సమాచారం అందించాల్సి ఉంది పోయి మొత్తం రా చేశారు. సుబ్బరంగా ఎంజాయ్ చేశారు.  పొరపాటును గమనించిన బ్యాంక్ వారి ఖాతాలను తనిఖీ చేయగా ఆ డబ్బులు ఖర్చు చేసినట్లు తెలిసింది. వారి ఖాతాలను తనిఖీ చేయగా ఆ డబ్బులను ఖర్చు చేసినట్లు తెలిసింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ కేసులో అరింబూర్ కు చెందిన నిధిన్, మను అనే ఇద్దరు నిందితులను త్రిస్సూర్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాల పంపిణీ..

బ్యాంకు అకౌంట్లో జమ అయిన తమవి కాని డబ్బులతో వారు  ఖరీదైన సెల్ఫోన్లు, ఖరీదైన వస్తువులు కొన్నారు. లోన్లు కట్టేందుకు కొంత డబ్బును ఉపయోగించారు. మరి కొంత డబ్బును షేర్ మార్కెట్లో  పెట్టారని  పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు తమ ఖాతాలో డబ్బులు ఉంటే వాటిని తిరిగి బ్యాంకు తీసుకుంటుందని అనుకున్నారు.  అందుకే తమ ఖాతా నుంచి ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని 19  వేరే బ్యాంకు లోనే  54 అకౌంట్లకు  ట్రాన్స్ఫర్ చేశారు. 

ఈ మేరకు పోలీసుల విచారణలో తేలింది. ఆయా అకౌంట్ లో నుంచి డబ్బులు వేరే వేరే అకౌంట్ లోకి వెళ్లాలని అధికారులు గుర్తించి పోలీసులకు తెలిపారు. అయితే ఈ పొరపాటుకు కారణం సర్వర్లో సమస్యలే. పొరపాటున డబ్బులు పడిన అకౌంట్ ఉన్న బ్యాంకు.. మరో బ్యాంకు లో విలీనం అయ్యింది.  దీనివల్ల సర్వర్లో సమస్యలు ఏర్పడి డబ్బులు పొరబాటున వేరే అకౌంట్ లోకి వచ్చి పడ్డాయి. అయితే, బ్యాంకు సర్వర్లను తారుమారు చేయడం ద్వారా డబ్బులు కాల్ చేశారా అనే కోణంలోనూ పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios