కానిస్టేబుల్ రాసలీలలు

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామనగర ట్రాఫిక్ డీఆర్ కానిస్టేబుల్ గతంలో కూడ ఇదే రీతిలో వివాహితతో సంబంధం పెట్టుకొన్న విషయం వెలుగు చూసింది. ఈ తరుణంలో స్థానికులు కానిస్టేబుల్ ను చితకబాదారు. ఈ ఘటన తర్వాత కూడ కానిస్టేబుల్ వైఖరిలో మార్పు రాలేదు.

రామనగర ట్రాఫిక్ కానిస్టేబుల్ వివాహితతో సంబంధం కొనసాగిస్తున్నాడు. పెళ్ళి కాక ముందు నుండే ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. పెళ్ళి తర్వాత కూడ ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.ఆమెకు గత నెలలోనే వివాహమైంది.గతంలో ఇదే తరహలో వివాహితతో సంబంధం కొనసాగించిన ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను చితకబాదారు ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో రామనగర్ కు బదిలీ చేశారు.

కానిస్టేబుల్ రాసలీలల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఘటన స్థానిక పోలీసులకు అవమానకరంగా మారింది. ఇక ఈ సంఘటనకు సంబంధించి చిత్రదుర్గ ఎస్పీ నుండి నివేదిక పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.