Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడి కోసం అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన బంగ్లా మహిళ.. కట్ చేస్తే..

ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడానికి బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళ అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించింది. అంతర్జాతీయ సరిహద్దు దాటి ఉత్తర త్రిపుర జిల్లాలోని ధర్మనగర్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఆమెను అరెస్టు చేశారు.  

Bangladesh Woman Arrested For Illegally Entering India To Marry Lover KRJ
Author
First Published Oct 28, 2023, 6:15 AM IST

ఇటీవల ప్రేమ, పెళ్లి పేరుతో ఇతర దేశాల నుంచి  మన దేశంలోకి యువతులు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఈ ఏడాది పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ అనే యువతి ఉత్తరప్రదేశ్ చెందిన యువకుడ్ని ప్రేమించి.. ఏకంగా సొంతదేశాన్ని వదిలి పిల్లలతో సహా  అక్రమంగా భారత్ లోకి ప్రవేశించింది. తాజాగా బంగ్లాదేశ్ కి చెందిన ఓ మహిళ తన ప్రేమికుడ్ని పెళ్లి చేసుకునేందుకు అక్రమంగా అంతర్జాతీయ సరిహద్దును దాటి ఇండియాకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువతిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర త్రిపుర జిల్లాలోని ధర్మనగర్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే ధర్మనగర్ సబ్ డివిజన్ పరిధిలోని ఫుల్‌బరీ నివాసి అయిన నూర్ జలాల్(34) ఆయుర్వేద వైద్యుడు. తరుచుగా అతను బంగ్లాదేశ్ లోని మౌల్వీ బజార్ కు వెళ్లి వచ్చే వాడు. ఈ క్రమంలో ఆయనకు నూర్ జలాల్(24) అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. అపరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆ వివాహిత సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటికే పెళ్లై, ఓ పిల్లాడు ఉన్న ఆమె ఎలాగైనా నూర్ జలాల్ తో జీవించాలని నిర్ణయించుకుంది. 

ఈ క్రమంలో 15 రోజుల క్రితం నూర్ ను పెళ్లి చేసుకునేందుకు ఆమె అక్రమంగా ధర్మనగర్ చేరుకుంది. ఈ క్రమంలో నూర్, ఫాతేమా ఇద్దరు ఫుల్బరీలో నివసిస్తున్నారు. అంతా హ్యాపీ అనుకునే సమయంలో బంగ్లాదేశ్ మహిళ అక్రమంగా భారత్ లో ప్రవేశించిందనీ, పోలీసులకు సమాచారం రావడంతో గురువారం ఆమెను అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సదరు మహిళను 14 రోజలు పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. అయితే.. నూర్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios