Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ-కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలతో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌క్క‌దారి ప‌డుతున్న‌య్.. : మాయావ‌తి

Lucknow: రాజకీయ దురుద్దేశం దేశానికి ప్రయోజనం కలిగించదని బీఎస్సీ అధినేత్రి మాయావ‌తి అన్నారు. రాహుల్ గాంధీ కోర్టు అంశాన్ని ప్ర‌స్తావిస్తూ.. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ విషయంలో ఏం జరుగుతుందో కాంగ్రెస్‌ ఆలోచించాలని ఆమె అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ముందుకు సాగుతున్న తీరును ఎత్తిచూపారు.
 

Bahujan Samaj Party president Mayawaticriticizes BJP and Congress RMA
Author
First Published Mar 25, 2023, 5:06 PM IST

Bahujan Samaj Party president Mayawati: రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించిన త‌ర్వాత బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి.. దేశంలో విధించిన  ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో, ఇప్పుడు తమ నాయకుడు రాహుల్ గాంధీతో జరుగుతున్నది సమంజసమేనా? అని కాంగ్రెస్ ఆలోచించాలని ఆమె అన్నారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కారణంగా ప్రజా సంక్షేమం, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం వంటి తీవ్రమైన సమస్యల తొలగింపుపై దృష్టి సారించలేదని మాయావతి విమర్శించారు.

ఇది చాలా బాధాకరమని, దురదృష్టకరమని ఆమె ట్వీట్ చేశారు. రాజకీయ దురుద్దేశం, ద్వేషం మొదలైన వాటి వ‌ల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేమ‌ని మాయావ‌తి అన్నారు. గత 75 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగ పవిత్ర ఉద్దేశం, ప్రజాస్వామిక నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా నిజాయితీ, సమగ్రతతో పనిచేసి ఉంటే భారతదేశం నిజంగా అగ్రగామి, ఆదర్శవంతమైన మానవతా, అభివృద్ధి చెందిన దేశంగా అవతరించి ఉండేదని ఆమె అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ల స్వార్థ రాజ‌కీయాలు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

యూపీలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆరేళ్లు పూర్తి చేసుకుందని పేర్కొన్న మాయావ‌తి.. ప్ర‌భుత్వం చేస్తున్న ఆర్భాటం, ఖరీదైన ప్రచారం ద్వారా చేస్తున్న పెద్ద వాదనలు, గ్రౌండ్ రియాలిటీతో నిజమైన సంబంధం ఉంటే సముచితంగా ఉండేవి. కానీ అలా జరగకపోవడంతో కోట్లాది మంది పేదలు, వెనుకబడిన వారిలో ఉత్సాహం తగ్గి, నిస్పృహ నెలకొందని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios