విద్యార్థులు పాఠశాలలకు తీసుకెళ్లే బ్యాగు బరువు విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం విద్యార్థి బరువులో బ్యాగు బరువు 15 శాతానికి మించి ఉండకూడదని పేర్కొంది.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు స్కూల్ బ్యాగ్ మార్గదర్శకాలను పాటించాలని కోరిన కర్ణాటకలోని ప్రభుత్వం.. దానికి సంబంధించిన ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని బ్లాక్ స్థాయి విద్యాధికారులను కోరింది.
ఈ సర్క్యులర్ ప్రకారం.. స్కూల్ బ్యాగ్ గరిష్ట బరువు విద్యార్థి బరువులో 15 శాతానికి మించకూడదు. మార్గదర్శకాల ప్రకారం 1-2 తరగతి పిల్లల బ్యాగులు 1.5-2 కిలోలు, 3-5 తరగతి పిల్లల బ్యాగులు 2-3 కిలోల బరువు ఉండాలి. 6-8 తరగతులు, 3-4 కిలోలు, 9-10 తరగతులకు 4-5 కిలోలు ఉండాలి.
ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
పాఠశాలలు వారానికి ఒకసారి, ముఖ్యంగా శనివారాల్లో 'నో బ్యాగ్ డే' జరుపుకోవాలని సర్క్యులర్ లో ప్రభుత్వం పేర్కొంది. డాక్టర్ వీపీ నిరంజనారాధ్య కమిటీ సిఫారసుల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్ బ్యాగ్ బరువుల కారణంగా పాఠశాల విద్యార్థులపై కలిగే ఆరోగ్య ప్రభావాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
కొన్నేళ్ల క్రితం ఏర్పాటైన ఈ కమిటీ 2018-19లో తుది నివేదికను సమర్పించింది. 2019లో ఈ కమిటీ తుది నివేదిక సమర్పించినప్పుడు స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల బరువులో 10 శాతానికి మించకుండా చూడాలని కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానిని ఇప్పుడు తిరిగి జారీ చేస్తూ.. విద్యార్థి బరువులో 15 శాతానికి మించి ఉండకూదని పేర్కొంది.
ప్రధాని అమెరికా పర్యటన.. హెచ్-1బీ వీసాలపై యూఎస్ కొత్త నిర్ణయం.. భారతీయులకు ఏ విధంగా ఉపయోగం అంటే ?
విద్యార్థులు ప్రతిరోజూ తీసుకెళ్లే భారీ స్కూల్ బ్యాగుల సమస్యను పరిష్కరించే ప్రమాణాలను అభివృద్ధి చేస్తామని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రకటించింది. పిల్లల హెవీ స్కూల్ బ్యాగుల గురించి అడిగిన ప్రశ్నలకు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ సమాధానమిస్తూ... సంస్థ పరిశోధన చేస్తుందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రమాణాలను సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు.
