Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ టు సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో నాణ్యత లేని ఆహారం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఆహారం కోసం డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నా.. క్వాలిటీగా ఉండటం లేదని ఓ ప్రయాణికుడు ఆరోపించారు. దీనిని మరో ప్రయాణికుడు వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. 

Bad quality food in Vande Bharat Express going from Vizag to Secunderabad.. Video viral on social media
Author
First Published Feb 6, 2023, 10:17 AM IST

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సరఫరా చేసే ఆహారం నాణ్యత సరిగా లేదంటూ ఓ వ్యక్తి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నెలలో ప్రారంభించిన సికింద్రాబాద్ టు వైజాగ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ఇది చోటు చేసుకుంది. ఈ వీడియోను ప్రతాప్ కుమార్ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 45 సెకండ్ల పాటు ఉన్న ఈ చిన్న క్లిప్‌లో ఓ ప్రయాణికుడు రైలులో సరఫరా చేసిన వడ నుంచి నూనెను పిండటం కనిపిస్తోంది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలులో అందించిన ఆహారంలో నాణ్యత లేదని ఫిర్యాదు చేస్తూ కంటైనర్ లో నేను పిండుతున్నారు. వందే భారత్ రైలులో ఆహార ధరలు అధికంగా ఉన్నాయని, కానీ క్వాలిటీ బాగా లేదని పేర్కొన్నారు. ఈ ప్రతాప్ కుమార్ అనే యూజర్ ట్విట్టర్‌ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకు ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలులో ఆహార ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, నాణ్యత బాగా లేదు.’’ అని క్యాప్షన్ పెట్టారు.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో పాటు ట్విట్టర్ యూజర్లలో చర్చకు దారితీసింది. కొంతమంది వినియోగదారులు ఈ ఫిర్యాదుపై విభేదించగా.. మరికొందరు మద్దతుగా నిలిచారు. ‘‘వందే భారత్ రైలులో ఆహార సేవ బాగుంది. ఇక్కడ చూపించినంత చెడ్డగా లేదు.’’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. మరో యూజర్ ఇది ‘‘షాకింగ్’’ అని పేర్కొన్నారు. 

కాగా.. ఈ వీడియోపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) స్పందించింది. ఇలాంటివి జరకుండా సంబంధింత అధికారికి సమాచారం అందించామని ట్వీట్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios