Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా: రెండేళ్ల ముందే బేబీ రాణి మౌర్య రిజైన్

ఉత్తరాఖండ్ గవర్నర్ పదవికి బేబీ రాణి మౌర్య రిజైన్ చేశారు. ఈ మేరకు ఆమె ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు రాజీనామా పత్రాన్ని పంపారు. 2018 ఆగష్టులో ఆమె ఉత్తరాఖండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లు పదవి కాలం ఉన్నా కూడ ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

Baby Rani Maurya resigns as Uttarakhand Governor
Author
New Delhi, First Published Sep 8, 2021, 3:48 PM IST

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్  గవర్నర్ పదవికి బేబీ రాణి మౌర్య బుధవారంనాడు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాణి మౌర్య రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు పంపారు.2018 ఆగష్టు మాసంలో బేబీ రాణి మౌర్య ఉత్తరాఖండ్ గవర్నర్ గా  నియమితులయ్యారు. అంతకుముందు ఆమె ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా మేయర్ గా పనిచేశారు.  2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్మాద్‌పూర్ స్థానం నుండి ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత రాజకీయ జీవితంలో ఆమె వెనుకడుగు వేశారు.

గవర్నర్ పదవిలో ఆమె ఇంకా రెండేళ్లు ఉండొచ్చు. కానీ నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బేబీ రాణి మౌర్య గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టుగా గవర్నర్ సెక్రటరీ మీడియాకు తెలిపారు.గత మాసంలోనే ఆమె ఉత్తరాఖండ్ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకొన్నారు. 

బేబీ రాణి మౌర్య రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios