అరుదైన ఘటన.. 26వేళ్ళతో పుట్టిన శిశువు.. దేవతా అవతారమంటున్న కుటుంబసభ్యులు...
ఓ చిన్నారి ఏకంగా 6 ఎక్స్ ట్రా వేళ్ళతో జన్మించింది. చేతులకు రెండేసి.. కాళ్లకు ఒక్కో అదనపు వేళ్లతో మొత్తంగా 26వేళ్ళు ఉన్నాయి. ఓ చిన్నారి ఏకంగా 6 ఎక్స్ ట్రా వేళ్ళతో జన్మించింది. చేతులకు రెండేసి.. కాళ్లకు ఒక్కో అదనపు వేళ్లతో మొత్తంగా 26వేళ్ళు ఉన్నాయి.

రాజస్థాన్ : రాజస్థాన్ జైపూర్ లో ఓ అరుదైన ఘటన వెలుగు చూసింది. సోమవారం ఓ మహిళ జన్మనిచ్చిన చిన్నారికి పుట్టుకతోనే 26 వేళ్లు ఉన్నాయి. జెనెటిక్ డిజార్డర్ వల్లే ఇలా ఉండాల్సిన దానికంటే ఎక్కువ వేళ్ళతో పుడతారని డాక్టర్లు చెబుతున్నారు. కానీ కుటుంబసభ్యులు మాత్రం.. తమ పూజించే దేవతే తమ ఇంట్లో పుట్టిందని సంబరపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే…
ఆదివారం రాత్రి రాజస్థాన్లోని దీగ్ జిల్లాలో ఓ మహిళ ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ చిన్నారికి పుడుతూనే కాళ్లు, చేతులకు ఎక్కువ వేళ్ళు ఉన్నాయి. కాళ్లకి 6వేళ్ల చొప్పున.. చేతులకి ఒక్కోచేతికి 7 వేళ్ల చొప్పున మొత్తం 26వేళ్లు ఉన్నాయి. మామూలుగా ఆరో వేలు ఉండడం.. అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది.
కానీ ఇన్ని ఎక్స్ ట్రా వేళ్ళతో జన్మించడం అరుదైన ఘటన. అయితే దీన్ని వైద్య భాషలో పాలిడాక్టిలీ అంటారని వైద్యులు చెబుతున్నారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు అంటున్నారు. ఎక్స్ట్రా వేళ్ళు ఉండడం వల్ల చిన్నారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా చెబుతున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం తాము పూజించే దోల్ గఢ్ దేవతా అవతారమని ఆ చిన్నారి తల్లిదండ్రులు నమ్ముతున్నారు. ఈ మేరకు చిన్నారి తాత సంతోషంగా చెప్పుకొచ్చాడు.