బీఏ థర్డ్ ఇయర్ స్టూడెంట్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని శివ్ నాడర్ యూనివర్సిటీలో గురువారం చోటుచేసుకుంది.  

న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడాలోని శివ్ నాడర్ యూనివర్సిటీలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన క్లాస్ మేట్ అయిన యువతిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను బాయ్స్ హాస్టల్‌లోని తన రూమ్‌కు వెళ్లాడు. ఆ రూమ్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.

అనూజ్, నేహా ఇద్దరూ బీఏ సోషియాలజీ చదువుతున్నారు. ఇద్దరూ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్.. క్లాస్‌మేట్లు. అనూజ్ యూపీలోని అమ్రోహ జిల్లాకు చెందినవాడు. నేహా చౌరాసియా కాన్పూర్‌కు చెందిన యువతి.

అనూజ్, నేహా దీర్ఘకాలం నుంచి మిత్రులుగా ఉంటున్నారు. అయితే.. కొన్నాళ్ల నుంచి మాత్రం వారిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, మంగళవారం వారిద్దరూ డైనింగ్ హాల్ దగ్గర కనిపించారు. ఆ తర్వాత ఇద్దరూ మాటల్లో పడిపోయారు. ఇరువురూ హగ్ చేసుకున్నారు కూడా. ఏమైందో ఏమో.. అనూజ్ తుపాకీ బయటికి తీసి అనూజ్‌ను షూట్ చేశాడు. వెంటనే అతను తన హాస్టల్ రూమ్‌లోకి వెళ్లి కాల్చుకున్నాడు.

Also Read: Titanic Ship: టైటానిక్ షిప్ శకలాల 3డీ స్కాన్ చిత్రాల వెల్లడి.. మైండ్ బ్లోయింగ్ పిక్స్ ఇవే

నేహాను వెంటనే సమీప హాస్పిటల్ తరలించచారు. కానీ, అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు.

వారు కొంత కాలం నుంచి మిత్రులుగా ఉంటున్నారని డీసీపీ సాద్ మియా ఖాన్ తెలిపారు. ‘ఇరువురూ వాగ్వాదం చేసుకున్న తర్వాత అనూజ్ తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత స్వయంగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు’ అని వివరించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నది.