Asianet News TeluguAsianet News Telugu

Titanic Ship: టైటానిక్ షిప్ శకలాల 3డీ స్కాన్ చిత్రాల వెల్లడి.. మైండ్ బ్లోయింగ్ పిక్స్ ఇవే

సుమారు 111 ఏళ్ల క్రితం ఒక భారీ ఓడ తన తొలి ప్రయాణాన్ని పూర్తి చేయకుండానే మార్గమధ్యంలో మహాసముద్రంలో కలిసిపోయింది. సుమారు 70 ఏళ్ల తర్వాత దాని ఆచూకి కనుగొనగలిగారు. కానీ, ఇప్పటి వరకు ఆ శకలాలను పూర్తిగా ఒకే ఫొటోలో చూడలేదు. ఇప్పుడు సుమారు 700000 లక్షల చిత్రాలను ఉపయోగించి ఒక ఫుల్ 3డీ స్కాన్ ఫొటోను తయారు చేశారు. ఆ చిత్రం మనసులో ఎన్నో సుడులను తింపుతున్నది.
 

titanic shipwreck captured in a full sized digital scan for the first time after more than 100 years of accident kms
Author
First Published May 18, 2023, 4:46 PM IST

లండన్: టైటానిక్ షిప్ తన తొలి ప్రయాణం 1912 ఏప్రిల్‌లో చేసింది. ఇంగ్లాండ్‌లోని సౌథంప్టాన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లాలి. అప్పటి వరకు నిర్మితమైన అతి భారీ ఓడ అయిన టైటానిక్ సంపన్నుల కళ్లు చెదరగొట్టింది. విలాసావంతమైన ఏర్పాట్లు అన్నీ అందులో ఉన్నాయి. జిమ్నాషియం, స్విమ్మింగ్ పూల్, స్మోకింగ్ రూమ్స్, హై క్లాస్ రెస్టారెంట్లు, కేఫ్‌లు అన్నింటిని ఏర్పాటు చేశారు. ఈ షిప్ 1912లో న్యూయార్క్‌కు బయల్దేరింది. కానీ, మార్గం మధ్యలోని అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ మంచు కొండ ఢీకొనడంతో తీవ్రంగా డ్యామేజీ అయింది. గమ్యం చేరకముందే మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన ఏప్రిల్ 1912లో జరిగింది. 1,500లకు పైగా ప్రయాణికులు ఈ ప్రమాదంలో మరణించారు. నార్త్ అట్లాంటిక్ ఓషియన్‌లో సుమారు 4000ల మీటర్లు(3,800 మీటర్లు) అంటే సుమారు నాలుగు కిలోమీటర్ల లోతున ఆ షిప్‌ శకలాలుగా పడిపోయి సెటిల్ అయింది.

1912లో ఈ టైటానిక్ మునిగినా దాన్ని కనుగొనడం అంత తేలికగా సాధ్యపడలేదు. 1985లో కెనడా తీరానికి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో తొలిసారి టైటానిక్ షిప్ శకలాలను గుర్తించారు. కానీ, వాటిని చూసిన వారు చెప్పడం వరకే అది జరిగింది. కెమెరా ఫొటోలు తీయడం సాధ్యం కాలేదు. అదీ షిప్ మొత్తాన్ని ఫొటో తీయడం అసాధ్యంగానే మిగిలిపోయింది. సుమారు 882 ఫీట్ల పొడవు ఉండటం.. షిప్ మునిగిన తర్వాత అది రెండు ముక్కలై 2,600 అడుగుల దూరంలో పడిపోయాయి. దీంతో ఈ భారీ షిప్‌ను ఒక్క ఫొటోగా చూడటం ఇది వరకు సాధ్యం  కాలేదు. కానీ, తాజాగా, ఈ చిత్రాలు బీబీసీలో పబ్లిష్ అయ్యాయి.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

మెగల్లాన్ లిమిటెడ్, అట్లాంటిక్ ప్రొడక్షన్‌లు 2022 నుంచి టైటానిక్ షిప్ ఫుల్ మ్యాప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి డాక్యుమెంటరీ కోసం ఈ రెండు సంస్థలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. డీప్ సీ మ్యాపింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఇవి టైటానిక్ షిప్ ఫుల్ 3డీ డిజిటల్ స్కాన్ సృష్టించాయి. ఇందుకోసం నీటిలోకి ఓ స్పెషలిస్ట్ షిప్‌ను పంపి ఫొటోలు తీసేలా.. దాన్ని బయటి నుంచే ఆపరేట్ చేసేలా స్పెషలిస్టు షిప్‌ను రూపొందించారు.

ఆ స్పెషలిస్టు షిప్‌ను టైటానిక్ షిప్ శకలాలు ఉన్న చోటికి మహా  సముద్రం అట్టడుగుకి పంపించారు. సుమారు 200 గంటలు ఆ షిప్ అక్కడే ఉండి సర్వే చేసింది. సుమారు 7 లక్షల చిత్రాలు తీసింది. వీటన్నింటిని ఉపయోగించి ఫుల్ 3డీ స్కాన్‌ను సృష్టించారు. ఇప్పుడు ఆ చిత్రాలు సోషల్ మీడియాలో సంచలనమయ్యాయి.

ప్రతి స్క్వేర్ సెంటిమీటర్‌ను మ్యాప్ చేశామని, అది బురదైనా.. చిన్న చిన్న శిథిలాలైనా అన్నింటిని తీశామని మెగల్లాన్‌కు చెందిన ఎక్స్‌పర్ట్ గెరార్డ్ సెఫర్ట్ తెలిపారు. అందుకే చిన్న చిన్న వివరాలను కూడా ఇప్పుడు మనం పొందగలిగామని వివరించారు. అయితే, ఆ శకలాలను తాకకుండా జాగ్రత్త పడ్డామని చెప్పారు. 

Also Read: Russia Ukraine War: ఈ యుద్ధంతో ఎవరు లబ్ది పొందుతున్నారు? ఎలా లాభాలు ఆర్జిస్తున్నారు? యుద్ధం వెనుక కథ ఇదీ

ఎట్టకేలకు మనం ఒకరు చెబితే విని ఊహించకుండా నేరుగా దాని ప్రస్తుత నిజ రూపాన్ని వీక్షించడం సాధ్యమైందని టైటానిక్‌ను కొన్నేళ్లపాటు అధ్యయనం చేసిన పార్క్స్ స్లెఫెన్సన్ తెలిపారు.

ఈ షిప్ పై జేమ్స్ కామెరాన్ టైటానిక్ సినిమా తీశారు. ఈ సినిమా వచ్చినప్పటి నుంచీ షిప్ గురించిన ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios