సీఎం కేసీఆర్ మరో సారి ప్రధాని మోడీని కలిసే అవకాశాన్ని వదులుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశంలోని ప్రముఖులతో ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎంకు అధికారికంగా ఆహ్వానం అందింది. 

75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆగస్టు 6వ తేదీన ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌పై జాతీయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ స‌మావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రావు దూరంగా ఉండే అవకాశం క‌నిపిస్తోంది. ఈ కమిటీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)కి సోమవారం ప్రధాని నుంచి ఆహ్వానం అందినట్లు అధికారిక వర్గాలు తెలిపాయ‌ని ‘డెక్కన్ క్రానికల్’ ఓ కథనంలో పేర్కొంది. 

యాంటీ డిప్రెషన్‌, మెడికేషన్‌తో సతమతం.. గతంలోనూ గంటల తరబడి గదిలోనే: ఉమామహేశ్వరి కేసులో వెలుగులోకి వాస్తవాలు

లోక్‌సభ స్పీకర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, అధికారులు, మీడియా ప్రముఖులు, ఆధ్యాత్మిక నాయకులు, కళాకారులు, సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి మోదీని కలవకుండా ఏదో ఒక కార‌ణం చెప్పి సీఎం కేసీఆర్ త‌ప్పించుకుంటున్నార‌ని, కాబ‌ట్టి ఈ స‌మావేశానికి కూడా ఆయ‌న హాజ‌ర‌య్యే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని టీఆర్ఎస్ వర్గాలు వెల్ల‌డించాయి. 

సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే తానియాఖాన్ మృతి...

మే 26న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 20వ వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు, ఆయన రాకకు కొన్ని గంటల ముందు సీఎం బెంగళూరు వెళ్లారు. జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు మళ్లీ నగరానికి వచ్చిన ప్ర‌ధాని మోడీని కేసీఆర్ క‌ల‌వ‌లేదు. ఇలా చాలా సంద‌ర్భంల్లో పీఎంను క‌లిసే అవ‌కాశాన్ని సీఎం వ‌దులుకుంటున్నారు.

మునుగోడు ఉపఎన్నిక.. బీజేపీ ఆరాటం వెనుక : మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ చివ‌రి సారిగా గతేడాది సెప్టెంబర్ 3న ఢిల్లీలో ప్ర‌ధాని మోడీని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై వినతులు సమర్పించారు. గతేడాది నవంబర్‌లో హుజూరాబాద్‌ ఉపఎన్నిక తర్వాత టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి, ఆ తర్వాత ప్ర‌ధాని మోడీని సీఎం ఎప్పుడూ క‌ల‌వ‌లేదు. అందుకే ఈ సారి కూడా క‌లిసే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని తెలుస్తోంది.