మునుగోడులో ఉపఎన్నికపై మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులకు అధికారం మీద యావ.. రాజకీయ ఆపేక్ష అని మంత్రి ఆరోపించారు. మీ రాజీనామాలు అధికారం కోసం, పదవుల కోసమేనంటూ హరీశ్ రావు దుయ్యబట్టారు.

మునుగోడులో ఉపఎన్నిక తెస్తామంటోన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి హరీశ్ రావు (harish rao) . ఆనాడు తెలంగాణ కోసం తాము పదవులను త్యాగం చేశామన్న ఆయన.. ఇప్పుడు బీజేపీ రాజకీయ ఆరాటం కోసం ఉపఎన్నిక కావాలంటోందని కౌంటరిచ్చారు. బీజేపీ నేతలు రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్ట్ కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ తెచ్చారా అంటూ హరీశ్ రావు ఫైరయ్యారు. బీజేపీ నాయకులకు అధికారం మీద యావ.. రాజకీయ ఆపేక్ష అని మంత్రి ఆరోపించారు. 

వున్న ఐటీఐఆర్‌ను రద్దు చేశారని.. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరినీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వున్నవి ఊడగొడుతున్నారని హరీశ్ ఫైరయ్యారు. మీ రాజీనామాలు అధికారం కోసం, పదవుల కోసమేనంటూ మంత్రి దుయ్యబట్టారు. ప్రజల మీద ప్రేమ వుంటే పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తీసుకురావాలని ఆయన సవాల్ విసిరారు. నిధులు ఇవ్వకుండా, ఉద్యోగాలను ఊడగొడుతూ, పేదలకు ఉన్న సబ్సిడీలు బంద్ చేయడమే బీజేపీ పని అంటూ హరీశ్ దుయ్యబట్టారు. ఉచితాలు వద్దని ప్రధాని నరేంద్ర మోడీయే చెబుతున్నారని మంత్రి చురకలు వేశారు. 

Also Read:వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 15 సీట్లే.. ఎమ్మెల్యేల్లో కేసీఆర్‌ ఉండరు, అప్పటికే జైల్లోకి : బండి సంజయ్ సంచలనం

అంతకుముందు ... మునుగోడులో (munugodu ) ఉపఎన్నికలు రావాలని టీఆర్ఎస్ (trs) కోరుకుంటుంటే.. కాంగ్రెస్ (congress) వద్దని కోరుకుంటోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) . ఈ సారి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు (trs) 15 సీట్ల కన్నా ఎక్కువ రావన్నారు. పాతబస్తీలోనూ వచ్చే ఎన్నికల్లో పాగా వేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఏం కోరుకుంటే తాము అటువైపే వుంటామని ఆయన అన్నారు. ఇక గజ్వేల్‌లో పోటీ చేస్తానంటూ ఈటల ప్రకటనపైనా బండి సంజయ్ స్పందించారు. ఎ

వరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చన్నారు. పోటీలకు సంబంధించి పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు అందరూ భయపడుతూ వున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో వ్యాపారస్తులు వ్యాపారం చేసే పరిస్థితి కూడా లేదన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఈసారి చిన్న చిన్న సమావేశాలే వుంటాయని.. పెద్ద నేతలెవ్వరూ రారని బండి సంజయ్ పేర్కొన్నారు.