లక్నో: అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వెయ్యాలా వెయ్యొద్ద అనే విషయమై నేటి మధ్యాహ్నం సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు, రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు తెలిపింది. ఈ సమావేశానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కూడా హాజరయ్యారు. 

కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయే 5 ఎకరాల స్థలం తమకు అంగీకారప్రాయం కాదని వారు అభిప్రాయపడ్డారు. ఆ స్థలాన్ని తాము నిరాకరిస్తున్నట్టు తెలిపారు. తమకు దక్కాల్సిన హక్కు దక్కలేదని, అందుకే రివ్యూ పిటిషన్ వెయ్యాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 

రివ్యూ పిటిషన్  వేసినా తమ హక్కు తమకు దక్కుతుందన్న నమ్మకం మాత్రం తమకు లేదని,అయినప్పటికీ రివ్యూ పిటిషన్ వేస్తామని వారు అన్నారు. 

ఇటీవల సుప్రీం కోర్టు అయోధ్యలో రామ మందిరానికి అనుమతి ఇస్తూ... మసీదు నిర్మాణానికి ప్రత్యేకంగా ఐదు ఎకరాలు భూమి కేటాయిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ తీర్పు పట్ల అసదుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాము  ఎవ్వరి దగ్గర భిక్ష కోసం పోరాటం చేయలేదని అసదుద్దీన్ పేర్కొన్నారు. 5 ఎకరాల భూమి కేటాయింపు రిజెక్ట్ చెయ్యాలన్నారు. వేరే చోట మసిద్  ను తాము కూడా  కట్టుకోగలమని అన్నారు. అక్కడున్న మసీదుకు 500 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పారు. 

 సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం సున్నీ వక్ప్‌బోర్డు తరపు ప్రతినిధులు ఈ తీర్పును స్వాగతిస్తున్నట్టుగా ప్రకటించారు.మరో వైపు ఈ తీర్పు వెలువడిన అనంతపురం బాబ్రీ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.

Also read:also read:Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , తుది తీర్పు ముఖ్యాంశాలు ఇవే..

సుప్రీంకోర్టు తీర్పు అసంతృప్తికరంగా ఉందని బాబ్రీ యాక్షన్ కమిటీ తరపు న్యాయవాది జిలానీ ప్రకటించారు. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నట్టుగా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడ ప్రకటించింది. తీర్పు అసంతృప్తిగానే ఉన్నా కూడ తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటించింది. 

Ayodhya Verdict: ఢిల్లీలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మకాం!

మరోవైపు సుప్రీంకోర్టు పిటిషన్‌కు సంబంధించిన తీర్పు పాఠం అందిన తర్వాత రివ్యూ పిటిషన్ వేయాలో వద్దో అనే విషయమై నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. ఏఎస్ఐ రిపోర్టులో ముస్లింలకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదని ముస్లిం లా బోర్డు అభిప్రాయపడింది.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇక్బాల్ అన్సారీ కూడ తీర్పుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ తీర్పు తనకు ఆనందం కల్గించిందన్నారు. 

శనివారం నాడు  వివాదాస్పద భూమికి సంబంధించి శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై  సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం నాడు ఉదయం ఐదుగురు జడ్జిల ధర్మాసనం తీర్పును వెల్లడించింది.

Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , లైవ్ అప్ డేట్స్