దీర్ఘకాలంగా నలుగుతున్న అయోధ్య వివాదానికి సుప్రీమ్ కోర్ట్ నిన్న స్వస్తిపలికింది. వివాదాస్పద భూమిని ట్రస్టుకు అప్పగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు పట్ల సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి ఏకే గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణం కోసం కేంద్రానికి అప్పగించాలన్న అత్యున్నత న్యాయస్ధాన తీర్పు మైనారిటీ వర్గాల కోణంలో సరైంది కాదని అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పుతో తాను కలత చెందానని ఆయన అన్నారు. 

Also read: Ayodhya verdict: తదుపరి అడుగులు ఉమ్మడి పౌర స్మృతి వైపేనా?

‘రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ హక్కులను ప్రసాదించింది. కానీ ఈ కేసులో మైనారిటీలకు న్యాయం జరగలేదు’అని మాజీ జడ్జి గంగూలీ కీలక వ్యాఖ్యలు చేసారు.  బాబ్రీమసీదును కూల్చివేశారనేది కాదనలేని విషయమని సుప్రీం కోర్టు సైతం తన తీర్పులో పేర్కొందని, బాబ్రీ విధ్వంసం చట్టవిరుద్ధమని కూడా తేల్చి చెప్పింది అన్నారు. దీన్నిబట్టి చూస్తే సుప్రీం తీర్పుతో మైనారిటీలకు అన్యాయం జరిగిందన్నది సుస్పష్టమని అభిప్రాయపడ్డారు. 

అయోధ్యలోని రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ శనివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మోడీ వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఇవాళ్టీ పరిస్థితులే నిదర్శనమన్నారు.

సుప్రీంకోర్టు తీర్పును గెలుపోటములుగా చూడవద్దని, రామభక్తి, రహీం భక్తి కాదని.. దేశభక్తి భావాన్ని బలోపేతం చేయాలని మోడీ పిలుపునిచ్చారు. దేశప్రజలంతా శాంతి, ఐకమత్యంతో ఉండాలని.. అయోధ్య తీర్పు న్యాయవ్యవస్థలోనే చారిత్రాత్మకమైనదని మోడీ వెల్లడించారు.

దశాబ్ధాలుగా వస్తున్న కేసుకు ముగింపు పడిందని..ఈ రోజు ప్రజాస్వామ్య శక్తిని నిరూపించిన రోజన్నారు. సంక్లిష్టమైన న్యాయబద్ధంగా పరిష్కరించొచ్చని సుప్రీంకోర్టు రుజువు చేసిందని ప్రధాని గుర్తుచేశారు. భారతదేశ న్యాయవ్యవస్థపై అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురిసిందని.. సుప్రీంకోర్టు తీర్పును దేశప్రజలు స్వాగతించారన్నారు.

Also Read:Ayodhya : సోషల్ మీడియాలో చర్చంతా ఆ తీర్ఫుపైనే.. గల్లంతైన మహా రాజకీయం

న్యూఇండియా నిర్మాణానికి సుప్రీం తీర్పు నాంది పలికిందని.. ప్రపంచానికి మనదేశ గొప్పతనం తెలిసిందని ప్రధాని కొనియాడారు. తీర్పు సందర్భంగా ప్రజలు చాలా సంయమనం పాటించారని.. ఇందుకు దేశ ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

అయోధ్య వివాదంపై  సుప్రీంకోర్టు శనివారం నాడు తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి తమదేనని షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను  సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

బాబ్రీమసీదు కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలియదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. అయోధ్య వివాదంపై  శనివారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీలు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించారు.

Also read: Ayodhya Verdict: కాశ్మీర్ టు అయోధ్య వయా కర్తార్ పూర్

మత గ్రంధాలను బట్టి కోర్టు తీర్పు ఉండదు నిర్మోహీ అఖాడా పిటిషన్‌ను కూడ కొట్టేసిన సుప్రీం కోర్టు. నిర్మోహి పిటిషన్‌కు కాలం చెల్లించదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఖాళీ ప్రదేశం బాబ్రీ మసీదును కట్టలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై తీర్పును శనివారం రోజున వెలువరించనున్న విషయాన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆసీనమయ్యింది. 

కాగా తీర్పు వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే అప్రమత్తత ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. యూపీ వ్యాప్తంగా 40 వేలకు పైగా సిబ్బందిని మోహరించింది. తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేం‍ద్ర ప్రభుత్వం ఇదివరకే హైఅలర్ట్‌ ‍ ప్రకటించింది. స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించేసారు. 

అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అంశం అయిన ఈ రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. 

Also read: రామ్, రహీమ్ భక్తి కాదు.. దేశభక్తి కావాలి: ప్రధాని నరేంద్రమోడీ

కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని  ఆదేశించింది. ఈ మేరకు గురువారంమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. సున్నితమైన అంశం గనుక ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ప్రధాని తీర్పుపై  స్పందించిన విషయం తెలిసిందే. 

సోషల్ మీడియా యూజర్స్ కు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసారు. తీర్పు వెలువడిన తరువాత తీర్పుకు వ్యతిరేకంగా లేదా సానుకూలంగా ఎటువంటి రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులు చేసినా, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు