Asianet News TeluguAsianet News Telugu

Ram Lalla Pran Pratishtha: 11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోడీ.. ఈ స‌మ‌యంలో ఏం చేశారో తెలుసా?

Ayodhya Ram Mandir Pran Pratishtha: అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ పూర్త‌యింది. ఈ క్ర‌మంలోనే అయోధ్య రామ మందిర ప్రాణ ప్ర‌తిష్ఠ పూర్త‌యిన త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న 11 రోజుల ఉప‌వాస దీక్ష‌ను విర‌మించారు.  
 

Ayodhya Ram Mandir: PM Modi breaks 11-day fast after Ayodhya Ram Lalla Pran Pratishtha RMA
Author
First Published Jan 22, 2024, 2:33 PM IST | Last Updated Jan 22, 2024, 2:33 PM IST

Ayodhya Ram Lalla Pran Pratishtha: అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్త‌యింది. మధ్యాహ్నం 12:29 గంటలకు  84 సెకన్ల పాటు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం  పూర్తైంది. మిగ‌తా కార్య‌క్రమాలు కూడా పూర్తాయిన త‌ర్వాత ప్రధాని నరేంద్ర మోడీ 11 రోజుల ఉపవాస దీక్షను విరమించారు. రామాలయంలో జరగనున్న 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల పాటు ఉప‌వాస దీక్ష‌లో ఉండి.. విస్తృతంగా ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు.

దైవ చింత‌న‌లో ఉంటూ ఉపవాస దీక్ష కాలంలో ప్రధాని క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆహార నియమాలను కఠినంగా పాటించారని మీడియా కథనాలు వెల్లడించాయి. నిరాడంబరతను ఎంచుకుని, నేరుగా నేలపై దుప్పటిపై పడుకున్నారు. కేవ‌లం కొబ్బరినీళ్ల మాత్రమే తీసుకున్నార‌ని స‌మాచారం. వివిధ ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న మోడీ.. గోపూజ, అన్నదానం, దుస్తుల పంపిణీ వంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రామ్ నాథ్ కోవింద్ నుంచి అంబానీ, బచ్చన్, టెండూల్కర్ వరకు.. అయోధ్య రాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు విచ్చేసిన ప్రముఖులు

ప్రధాని ఆధ్యాత్మిక ప్రయాణంలో నాసిక్ లోని రామ్ కుండ్, శ్రీ కాలారామ్ ఆలయం, లేపాక్షి (ఆంధ్రప్రదేశ్) లోని వీరభద్ర ఆలయం, గురువాయూర్ ఆలయం, కేరళలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయం వంటి ప్రదేశాలను సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన తమిళనాడులోని ఆలయాలను కూడా మోడీ ద‌ర్శించారు. 

Ayodhya Ram Mandir: PM Modi breaks 11-day fast after Ayodhya Ram Lalla Pran Pratishtha RMA

ఇక దేవాలయాల్లో పరిశుభ్రతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోడీ #SwachhTeerthCampaign ప్రారంభించారు. నాసిక్ లోని శ్రీ కాలారామ్ ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించగా, దీనికి విస్తృత మద్దతు లభించింది. పురోహితుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఉప‌వాస దీక్ష‌కు సంబంధించి కఠినమైన నియమాలను వివరించారు. నేలపై పడుకోవడం, సత్యం, 'గాయత్రి మంత్రం' వంటి మంత్రాలను జపించడం, ఆకుపై తినడం, రోజుకు రెండుసార్లు స్నానం చేయడం, 'బ్రహ్మచర్యాన్ని' పాటించడం వంటి అంశాలను నొక్కి చెప్పారు. యజ్ఞం, లేదా అటువంటి పద్ధతులను చేపట్టే వ్యక్తి ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలన్నారు. 

రామజన్మభూమి ట్రస్టుకు చెందిన స్వామి గోవింద్ దేవ్ గిరి జీ మహరాజ్ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన ఆచారాలను స్వీకరించడంలో ప్రధాని అచంచలమైన భక్తిని ప్రశంసించారు. 11 రోజుల ప్రత్యేక అభ్యాసానికి మొదట కోరిన మూడు రోజులకు మించి మోడీ నిబద్ధతను హైలైట్ చేశారు. ''3 రోజుల పాటు పూజలు నిర్వహించాలని మోదీజీని కోరాం. 11 రోజుల పాటు ఇలా చేశారు. ఏకాభక్తం చేయమని మోదీని కోరాం. 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. 3 రోజులు నేలపై పడుకోవాలని చెప్పాం. మోడీ 11 రోజుల పాటు నేలపైనే నిద్రించార‌ని'' తెలిపారు.
ఎన్నో జ‌న్మ‌ల ఫ‌లమిది.. అయోధ్య రామయ్య దివ్యమంగళ దర్శనం.. ఫొటోలు మీరు చూసేయండి.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios