Asianet News TeluguAsianet News Telugu

ఇస్లాం జెండాల‌తో అయోధ్య‌ రామ మందిరం ఫోటో ఎడిట్.. ఓ యువ‌కుడు అరెస్టు

Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ పూర్త‌యింది. అయితే, అంతా రామ‌భ‌క్తితో మునిగిపోయి వుండ‌గా, అయోధ్య రామాల‌యం ఫొటోను ఇస్లాం జెండాల‌తో ఎడిట్ చేసిన ఫొటో నెట్టింట క‌ల‌క‌లం రేపింది. ఈ క్ర‌మంలోనే ఒక వ్య‌క్తి అరెస్టయ్యాడు. 
 

Ayodhya Ram Mandir photo edit with Islamic flags, youth from Karnataka arrested RMA
Author
First Published Jan 22, 2024, 2:00 PM IST

Ayodhya Ram Lalla Pran Pratishtha: అయోధ్య రామ‌మందిరం ప్రారంభోత్స‌వం వేళ‌.. ఇస్లాం జెండాల‌ను ఉంచిన అయోధ్య రామాల‌యం ఫొటోలు నెట్టింట క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపాయి. ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ఒక వ్య‌క్తిని అరెస్టు చేశారు. వివ‌రాల్లోకెళ్తే.. కర్ణాటకలోని గదగ్ జిల్లాకు చెందిన తాజుద్దీన్ దఫేదార్ అనే వ్యక్తిని గజేంద్రగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. రామ మందిరం ఫొటోల‌ను ఎడిట్ చేసి దానిపై ఇస్లామిక్ జెండాను ఉంచి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్ట్ చేశాడు. ఇది అయోధ్యలో రాముని ప్రాణ‌ ప్రతిష్ఠకు ముందు హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసే చ‌ర్య‌గా పేర్కొంటూ.. ప‌లు హిందుత్వ సంస్థలు పోలీసులను అప్రమత్తం చేశాయి. ఈ క్ర‌మంలోనే ఆ పోస్టుల‌ను తొల‌గించ‌డంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇస్లాం జెండాలు ఉంచిన రామాల‌యం ఎడిట్ ఫొటోల‌పై ఫిర్యాదు అందుకున్న గదగ్ జిల్లా పోలీసులు వెంటనే తాజుద్దీన్ దఫేదార్ ను అరెస్టు చేసి సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర పోస్టును తొలగించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి మతపరమైన మనోభావాలను దెబ్బతీసేందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని పోలీసు శాఖ స్ప‌ష్టం చేసింది.

ఎన్నో జ‌న్మ‌ల ఫ‌లమిది.. అయోధ్య రామయ్య దివ్యమంగళ దర్శనం.. ఫొటోలు మీరు చూసేయండి.. !

త‌మిళ‌నాడు స‌ర్కారు ఉత్త‌ర్వుల‌పై స్టే.. 

రామ మందిర కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వం నుంచి స్పందన కోరడమే కాకుండా, లైవ్ స్ట్రీమింగ్ మరో సామాజికవర్గానికి చెందిన పని అయినంత మాత్రాన ఆపలేమని తెలిపింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుపై ప్రత్యక్ష ప్రసారంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. రామ మందిర కార్యక్రమానికి ఎల్ ఈడీలను ఏర్పాటు చేయరాదనీ, ప్రత్యక్ష ప్రసారం చేయరాదని తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ఆంక్షలు లేవని, ప్రజలంతా ప్రార్థనలు చేసుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. పూజలు, అర్చనలు, భజనలపై ఎలాంటి నిషేధం లేదని, ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమన్నారు.

రామ్ నాథ్ కోవింద్ నుంచి అంబానీ, బచ్చన్, టెండూల్కర్ వరకు.. అయోధ్య రాముని ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు విచ్చేసిన ప్రముఖులు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios