కాస్త దూరానికి రూ.700 : నైట్ కర్ఫ్యూలో దోచేస్తున్న ఆటోవాలాలు
దేశంలో భారీగా పెరుగుతున్న కేసులతో వివిధ రాష్ట్రాలు వణికిపోతున్నాయి. కేసుల కట్టడి కోసం లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది.
దేశంలో భారీగా పెరుగుతున్న కేసులతో వివిధ రాష్ట్రాలు వణికిపోతున్నాయి. కేసుల కట్టడి కోసం లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది.
రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇదే అదనుగా ఆటోలు, టాక్సీ డ్రైవర్లు ప్రజలను దోచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి విమానాలు, బస్సులు, రైళ్లలో వచ్చే వారి కోసం కొన్ని ఆటోలు, కాల్‌ట్యాక్సీలకు ప్రభుత్వం అనుమతించింది.
ప్రజల అవసరాలను అదనుగా చేసుకుని కొందరు ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా చార్జీలను వసూలు చేస్తున్నారు. బుధవారం వేకువజామున ఈరోడ్ నుంచి చెన్నైకు ఏర్కాడ్ ఎక్స్‌ప్రెస్ వేకువజామున 3.30 గంటలకు వచ్చింది.
Also Read:భయపెడుతున్న మూడోరకం కరోనా.. ట్రిపుల్ మ్యూటెంట్ తో కలకలం..
ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆటో డ్రైవర్లను సంప్రదించగా, వారు అడిగిన మొత్తం విని అవాక్కయ్యారు. చెన్నై సెంట్రల్ నుంచి చెప్పాక్కంకు రూ.300, తిరువాన్మియూరుకు రూ.500, పాలవాక్కంకు రూ.700 చొప్పున ఆటోవాలాలు చార్జీని డిమాండ్ చేశారు.
వీరిలో కొందరు గత్యంతరం లేక ఆటోడ్రైవర్లు అడిగినంత ముట్టజెప్పి గమ్యస్థానానికి చేరుకున్నారు. మరోవైపు ఎంటీసీ వేకువజామున 4 గంటల నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులను నడపడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, మెట్రో రైల్ సర్వీసులు కూడా ఉదయం 5.30 గంటలకే ప్రారంభంకానున్నాయి.