Asianet News TeluguAsianet News Telugu

భయపెడుతున్న మూడోరకం కరోనా.. ట్రిపుల్ మ్యూటెంట్ తో కలకలం..

దేశంలో కోవిడ్ రోజురోజుకూకొత్త పుంతలు తొక్కుతోంది. వైరస్ అనేక రకాలుగా ఉత్పరివర్తనం చెందుతుంది. ఉత్పరివర్తనాలు వల్లనే వ్యాప్తి అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇప్పటికే డబల్ మ్యూటెంట్ వైరస్ వ్యాప్తి తో కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే.. కొత్తగా ట్రిపుల్ మ్యూటెంట్ వెలుగులోకి రావడం శాస్త్రవేత్తల్లో చర్చనీయాంశంగా మారింది. 

Triple mutant Covid in India - bsb
Author
Hyderabad, First Published Apr 22, 2021, 9:25 AM IST

దేశంలో కోవిడ్ రోజురోజుకూకొత్త పుంతలు తొక్కుతోంది. వైరస్ అనేక రకాలుగా ఉత్పరివర్తనం చెందుతుంది. ఉత్పరివర్తనాలు వల్లనే వ్యాప్తి అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇప్పటికే డబల్ మ్యూటెంట్ వైరస్ వ్యాప్తి తో కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే.. కొత్తగా ట్రిపుల్ మ్యూటెంట్ వెలుగులోకి రావడం శాస్త్రవేత్తల్లో చర్చనీయాంశంగా మారింది. 

ప్రత్యేకమైన జన్యువుతో, రోగనిరోధకశక్తిని దాటుకుని చొచ్చుకుపోయే కొత్త ఉత్పరివర్తనలు ప్రవర్తనతో b1.618గా రకం వైరస్ పశ్చిమబెంగాల్లో వ్యాప్తిలో ఉందని సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో ఇండియన్ వేరియంట్ గా చెప్పుకునే డబుల్ న్యూటన్ బి.1.167 రకం ఎక్కువ శాతం ఉంది.

రోగనిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే సామర్థ్యం ఉండడం వల్ల ఇది ఎక్కువ వ్యక్తికి కారణమవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. వ్యాధికారక కీలక స్పైక్ ప్రొటీన్ భాగంలో ఈ 484 క్యూ, ఎల్452ఆర్ రెండు ఉత్పరివర్తనాలతో కలిసి ఏర్పడడంతో డబులు మ్యుటెంట్ అంటున్నారు. ఈ 484 క్యూ మ్యుటేషన్ యూకే, దక్షిణాఫ్రికా నుంచి, ఎల్452ఆర్ మ్యుటేషన్ కాలిఫోర్నియా నుంచి వ్యాపించాయి.

ఈ రెండూ కలిసి దేశీయంగా డబుల్ మ్యుటెంట్ ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది శరీర కణాలతో ఎక్కువగా అతుక్కుపోయే, రోగ నిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉందని భావిస్తున్నారు. 

తాజాగా బయటపడిన ట్రిపుల్ మ్యుటెంట్ బి.1.618 రకం వైరస్ లో స్పైక్ ప్రొటీన్ లో ఈ 484 కే, డీ614జి రకాలను కలిగి ఉండటంతో కొత్త లక్షణాలతో సంక్రమణ సామర్థ్యాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్త వినోద్ స్కారియా తెలిపారు. ఇది మరింత వేగంగా వ్యాపించగల రకం అని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios