ఆటోడ్రైవర్ అతివేగం.. తల్లి ఒడిలోంచి ఎగిరిపడ్డ చిన్నారి.. దుర్మరణం

auto driver over speed.. Childs fatal fall from speeding auto
Highlights

పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆటోవాలాలు అతివేగాన్ని వదలడం లేదు.. తాజాగా ఓ ఆటోడ్రైవర్ అతివేగం చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది.

పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆటోవాలాలు అతివేగాన్ని వదలడం లేదు.. తాజాగా ఓ ఆటోడ్రైవర్ అతివేగం చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. కోల్‌కతాలోని బారానగర్‌కు చెందిన రింకీ సర్దార్ అనే మహిళ ఏడాదిన్నర వయసున్న తన బాబును ఒళ్లో ఉంచుకుని ఆటోలో ప్రయాణిస్తోంది.

ఆటో ఎక్కిన దగ్గరి నుంచి డ్రైవర్ వేగంగానే నడుపుతున్నాడు.. కాస్త నెమ్మదిగా వెళ్లాలని రింకీ సూచిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఏకే ముఖర్జీ రోడ్ దగ్గరకు రాగానే రోడ్డుపై ఉన్న గుంతను తప్పించడానికి డ్రైవర్ ఆటోను వేగంగా పక్కకు తిప్పాడు.. దీంతో ఆటో కుదుపులకు లోనై వెనుక సీట్లో కూర్చొని ఉన్న రింకీసర్దార్ చేతుల్లోని పసిబిడ్డ ఎగిరిపడ్డాడు.. చిన్నారిని కాపాడటానికి కదులుతున్న ఆటోలోంచి కిందకు దూకింది.

వీరిద్దరికి ఏం జరిగిందోనని పట్టించుకోకుండా.. కనీసం వెనుదిరిగి చూడకుండా ఆటోడ్రైవర్ ఆటోలో వేగంగా వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్థానికులు రోడ్డుపై ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి చిన్న చిన్న గాయాలైనప్పటికీ... శరీరం లోపల అంతర్గత రక్తస్రావం కారణంగా బాబు మరణించాడు. రింకీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

loader