Asianet News TeluguAsianet News Telugu

కుర్చీని కాపాడుకునేందుకే ఔరంగాబాద్ పేరు మార్చారు - ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్

అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు సంకీర్ణ ఎంవీఏ ప్రభుత్వం ఔరంగాబాద్ పేరు మార్చాలని నిర్ణయించిందని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. ఈ పేరు మార్పు విషయంలో పోరాటం చేస్తామని చెప్పారు. 

Aurangabad was renamed to save the chair - AIMIM leader Imtiaz Jalil
Author
Mumbai, First Published Jul 6, 2022, 1:30 PM IST

ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా మార్చిన ఎంవీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) ఎంపీ ఇంతియాజ్ జలీల్ మంగళవారం తప్పుబట్టారు. అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు ఛత్రపతి శంభాజీ పేరును వాడుకున్నార‌ని, కానీ అలా జ‌ర‌గలేద‌ని చెప్పారు. ‘‘ ఔరంగాబాద్ పేరు మార్చాలని హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు. తమ కూర్చీ పోతోందని, బహుశా శంభాజీ పేరు వారిని కాపాడుతుందని అనుకున్నారు ’’ అని ఆయన వార్తా సంస్థ ఏఎన్ఐతో తెలిపారు.  

heavy rain: ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు.. రైలు, బస్సు సర్వీసులకు అంతరాయం

ఔరంగాబాద్ లో నివ‌సించే వారు.. అందులో ఏ మ‌తానికి చెందిన వారైనా స‌రే ఈ పేరుతో అనుబంధం క‌లిగి ఉన్నారు. పేరు మారాలని ఎవరూ కోరుకోలేని అన్నారు. ఈ విష‌యంలో తాము పోరాడుతామ‌ని చెప్పారు. నిర‌స‌న‌లు తెలియ‌జేస్తామ‌ని, కోర్టుకు వెళ్తామ‌ని, పార్ల‌మెంట్ లో గ‌ళం విప్పుతామ‌ని చెప్పారు.

ఉద్ద‌వ్ ఠాక్రే త‌న ప‌దవికి రాజీనామా చేసే ముందు ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా, ఉస్మానాబాద్ పేరును ధారశివ్ గా మార్చాలన్న ప్రతిపాదనకు కేబినేట్ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో సంబంధాలను తెంచుకోవాలని కోరుతూ ఠాక్రేకు వ్యతిరేకంగా వెళ్లిన త‌న సొంత ఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి వెళ్లడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వ భావజాలంతో రాజీ పడ్డారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు.

రాత్రంతా జాతర.. తిరువనంతపురంలో మిడ్ నైట్ షాపింగ్ కాన్సెప్ట్.. నేడే ట్రయల్.. 24 గంటల షాపింగ్‌కు నాంది

ఠాక్రే తన ఓటర్లలో ఒక సందేశాన్ని పంపాలని కోరుకున్నారని, అందుకే సీఎంగా త‌న చివరి కేబినెట్ సమావేశంలో పేరు మార్చాలని నిర్ణయించుకున్నారని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అబూ అసిమ్ అజ్మీ కూడా ఈ రెండు నగరాల పేర్లను మార్చాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

Ajmer Dargah Cleric: నుపూర్ శ‌ర్మ‌పై తీవ్ర వ్యాఖ్య‌లు.. అజ్మీర్ దర్గా మతాధికారి అరెస్ట్

ఔరంగాబాద్ పేరును మార్చాలని శివసేన చాలా కాలంగా ప్రయత్నించింది. కానీ సంకీర్ణంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ దీనిని అడ్డుకున్నాయ‌ని అప్పట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌భుత్వం ప‌డిపోతున్న చివ‌రి స‌మ‌యంలో ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. గత నెలలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి వద్ద AIMIM నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ నివాళులర్పించారు. ఆ త‌ర్వాత మహారాష్ట్రలో ఒక్క‌సారిగా రాజకీయ దుమారం రేగింది. ఈ పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే స్పందిస్తూ ఓవైసీని 10 నిమిషాల పాటు త‌మ‌కు అప్పగించాలని లేదా ఔరంగజేబు ఉన్న చోటకే పంపాలని మహారాష్ట్ర పోలీసులను కోరారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఓవైసీకి వ్యతిరేకంగా ఎంవీఏ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని బీజేపీ ఆరోపించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios