Asianet News TeluguAsianet News Telugu

Salman Rushdie stabbing : సల్మాన్ రష్దీపై దాడి జిహాదీ చేసిన భయంకరమైన చర్య - కంగనా రనౌత్

సల్మాన్ రష్దీపై దాడిని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్రంగా ఖండించారు. ఇది జీహాాదీలు చేసిన భయంకరమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ‘ది సాటానిక్ వెర్సె స్’ గొప్ప పుస్తకాల్లో ఒకటని ఆమె అన్నారు. 

Attack on Salman Rushdie was a horrific act by a Jihadi - Kangana Ranaut
Author
First Published Aug 13, 2022, 1:16 PM IST

రచయిత సల్మాన్‌ రష్దీపై జరిగిన దాడిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయ‌న వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విషమంగానే ఉంద‌ని నివేదిక‌లు వెలువ‌డుతున్నాయి. క‌న్ను కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని, అలాగే కిడ్నీలు దెబ్బ‌తిన్నాయ‌ని తెలుస్తోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ ఎన్జీవో శుక్రవారం నిర్వ‌హించిన జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో సల్మాన్ రష్దీ మెడపై, పొత్తికడుపుపై ​​ఓ దుండ‌గుడు దాడి చేశారు. 

సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్..

ఈ ఘ‌ట‌న‌పై స‌ర్వాత్ర నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడి చేసిన వ్య‌క్తిని న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మాటర్‌గా గుర్తించారు.ఈ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ న‌టి కంగనా ర‌నౌత్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దుండ‌గుడిని ఆమె ‘‘జిహాదీ’’గా అభివర్ణించారు. ‘‘ మరో రోజు జిహాదీలు చేసిన మరో భయంకరమైన చర్య ఇది. ‘ది సాటానిక్ వెర్సె స్’ ఆ కాలంలోని గొప్ప పుస్తకాలలో ఒకటి. ఈ భ‌యంక‌ర‌మైన ఘ‌ట‌న న‌న్ను చెప్ప‌లేనంత‌గా క‌దిలించింది ’’ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

సల్మాన్ రష్దీకి ప్రస్తుతం 75 ఏళ్లు. ఆయ‌న 1947 జూన్ నెల‌లో జ‌న్మించారు. ‘ది సాటానిక్ వెర్సెస్’ అని రాసిన ఆయ‌న వివాదంలో చిక్కుకున్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న ఇస్లాంవాదుల మరణ బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఇది ఏళ్ల పాటు కొన‌సాగింది. ఈ పుస్తకం భారతదేశంతో పాటు అనేక దేశాల్లో నిషేధానికి గుర‌య్యింది. ఈ పుస్త‌కం రాసినందుకు ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ రుహోల్లా ఖొమేనీ ర‌ష్దీపై ఫ‌త్వా జారీ చేశారు. ఆయ‌న‌ను చంపిన వారికి న‌గ‌దు ప్రోత్సాహ‌కం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే త‌రువాత ఇరాన్ ప్ర‌భుత్వం అది ఆయ‌న వ్యక్తిగ‌త అభిప్రాయం అంటూ దానిని కొట్టిపారేసింది. అయితే 2012లో సల్మా న్ రష్దీకి ఇర్ నుంచి హ‌త్యా బెదిరింపులు వ‌చ్చాయి. ఇరాన్ కు చెందిన మ‌త సంస్థ ఆ రివార్డ్ మొత్తాన్ని 3.3 మిలియన్ డాల‌ర్ల‌కు పెంచింది.

‘కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం కోసం మహిళలు ఎవరితోనైనా పడుకోవాలి ’ - కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖ‌ర్గే

1989లో ఇరాన్ అతడిపై ఫత్వా జారీ చేసిన కొద్ది రోజులకే ముంబైలో అల్ల‌ర్లు జ‌రిగాయి. ఈ అల్ల‌ర్ల‌లో 12 మంది మరణించారు. ఈ పుస్త‌కానికి వ్య‌తిరేకంగా ఇంగ్లాడ్ వీధుల్లో రష్దీ బొమ్మ‌లు ద‌హ‌నం చేశారు. అలాగే ఆ పుస్తకానికి సంబంధించిన కాపీల‌ను కూడా ద‌హ‌నం చేశారు. ఒక నెల తర్వాత ఇస్లామాబాద్‌లోని US సమాచార కేంద్రంపై 1000 మంది పాకిస్థానీయులు దాడి చేశారు. ఐరోపాలో కూడా నిరసనలు జరిగాయి.  లండన్ టెహ్రాన్ దాదాపు రెండు సంవత్సరాల పాటు దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి.

కంగ‌నా రనౌత్ తో పాటు మ‌రి కొంద‌రు కూడా ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు. ‘‘ సర్ సల్మాన్ రష్దీని మనం సమర్థించుకోవడం ఎప్పటికీ మానుకోకూడదు. ప్రస్తుతం నా ఆలోచనలు అతడి ప్రియమైన వారితో ఉన్నాయి. ఆయన క్షేమంగా ఉన్నారని మేమంతా ఆశిస్తున్నాం’’ అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రష్దీ కత్తిపోట్లకు గురికావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్దీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తానని అమెరికన్ నవలా రచయిత ఖలీద్ హొస్సేనీ తెలిపారు. ఆయ‌న‌పై జరిగిన ఈ దాడికి తాను భయపడిపోయానని పేర్కొన్నాడు.

ఆంగ్లేయుల‌తో పోరాడి అరెస్టైన తొలి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధురాలు క‌మ‌లా దేవి ఛ‌టోపాధ్యాయ‌

కాగా సల్మాన్ రష్దీ 1981లో తన రెండో  నవల ‘‘ మిడ్‌నైట్స్ చిల్డ్రన్’’ తో వెలుగులోకి వచ్చారు. ఈ పుస్తకం స్వాతంత్య్రానంతర భారతదేశాన్ని చిత్రీకరించినందుకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. అలాగే బ్రిటన్ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్‌ని గెలుచుకుంది. సాహిత్యాన్ని అందించినందుకు క్వీన్ ఎలిజబెత్ II రష్దీకి 2007లో నైట్ బిరుదును అందించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios