Asianet News TeluguAsianet News Telugu

‘కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం కోసం మహిళలు ఎవరితోనైనా పడుకోవాలి ’ - కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖ‌ర్గే

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మహిళలు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరితోనైనా పడుకోవాల్సి వస్తోందని, పురుషులు లంచాలు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. 

Congress MLA Priyank Kharge says women should sleep with anyone to get a government job in Karnataka
Author
First Published Aug 13, 2022, 12:18 PM IST

క‌ర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం మగవారు లంచం ఇవ్వాల్సి ఉంటుందని, యువతులు ఎవరితోనైనా పడుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రిక్రూట్‌మెంట్ స్కామ్‌లపై న్యాయ విచారణ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అన్నారు. 

ఆంగ్లేయుల‌తో పోరాడి అరెస్టైన తొలి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధురాలు క‌మ‌లా దేవి ఛ‌టోపాధ్యాయ‌

వివిధ ఉద్యోగాల నియామకాల్లో బీజేపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఖ‌ర్గే ఆరోపించారు. పోస్టులు అమ్ముకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, యువతులకు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఎవరితోనైనా పడుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పురుషులు లంచాలు ఇవ్వాల్సిందేనని అన్నారు. ‘‘ ఉద్యోగం కోసం ఆ యువతిని తనతో పడుకోవాల‌ని ఓ మంత్రి అడిగాడు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతడు రాజీనామా చేశాడు ’’ అని ఆయన తెలిపారు.

కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్‌తో పాటు మొత్తంగా 1,492 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహించిందని ఆయన చెప్పారు. బ్లూటూత్‌తో పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థిని గోకాక్‌లో అరెస్టు చేశారని తెలిపారు. తనకున్న సమాచారం మేరకు మొత్తం 600 పోస్టులకు డీల్‌ జరిగినట్లు అనుమానం ఉందని అన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు, జూనియర్ ఇంజనీర్ పోస్టుకు రూ.30 లక్షలుగా నిర్ణ‌యించార‌ని, ఇందులోనే రూ.300 కోట్ల అవినీతి జరిగినట్లు త‌న‌కు సమాచారం ఉంద‌ని చెప్పారు. 

‘‘ప్రతి రిక్రూట్‌మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగితే పేద, ప్రతిభ ఉన్న విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలి.. ఏ స్కామ్ వెలుగులోకి వచ్చినా తమకు ఏమీ జరగదని నిందితులు, దళారులకు తెలుసు.. కేపీటీసీఎల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సుమారు 3 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోంది. ’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు. 40 శాతం కమీషన్ కోసం పద్దతిగా వ్యాపారం చేసిన వారిపై అభ్యర్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని తెలిపారు.

ఆప్-బీజేపీల మ‌ధ్య కొన‌సాగుతున్న మాట‌ల యుద్ధం.. !

ప్రభుత్వ ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకున్న ఖర్గే.. దేశభక్తిని బీజేపీ వ్యాపారం కోసం వాడుకుంటోందని అన్నారు. ‘‘ బీజేపీ కూడా దేశభక్తిని వ్యాపారం కోసం ఉపయోగిస్తోంది. పాలిస్టర్ జెండాల వినియోగాన్ని దృష్టిని ఆకర్షించడానికి వీలుగా ఫ్లాగ్ కోడ్‌ను సవరించబడింది. దీని వ‌ల్ల అత్య‌ధికంగా రిలయన్స్ కంపెనీకి లాభం జ‌రుగుతోంది. అధికారులను ఫ్లాగ్ సేల్స్‌మెన్‌గా మార్చారు. రైల్వే సిబ్బందికి జెండాలు తప్పనిసరి తీసుకోవాల‌ని ఆదేశాలు వ‌చ్చాయి. దీని కోసం వారి జీతాల నుంచి కోత విధిస్తున్నారు’’ అని ఆయ‌న ఆరోపించారు. 

ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కు ఆకతాయిల వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు...

కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి జెండాను ఉచితంగా ఇచ్చే అర్హత లేదా అని ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు. ‘‘అధికారులు కూడా నన్ను పిలిచి 20 వేల జెండాలు కొనాలని అడిగారు. నేను దానికి విభేదిస్తున్నాను. పాలిస్టర్ జెండాలకు బదులుగా, మేము జిల్లా కాంగ్రెస్ నుంచి 10,000 ఖాదీ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాము’’ అని ఆయన అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios