కుటుంబ కలహాల వల్ల ఓ తల్లి తన మూడేళ్ల కూతురును చంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. భర్త ఫిర్యాదు చేయడంతో భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. 

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో దారుణం జ‌రిగింది. కుటుంబ క‌ల‌హాల వ‌ల్ల ఓ తల్లి త‌న క‌న్న కూతురునే క‌డ‌తేర్చింది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో భ‌ర్త ఆఫీసులో ఉన్నారు. ఇంటికి వ‌చ్చి చూసే కూతురు అప‌స్మార‌క స్థితిలో క‌నిపించింది. దీంతో అత‌డు పోలీసులు ఫిర్యాదు చేశాడు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మీరట్‌లోని ఇంచోలి ప్రాంతానికి చెందిన మోహినిని 2016 సంవ‌త్స‌రంలో రోహిత్ అనే వ్య‌క్తి పెళ్లి చేస‌కున్నాడు. ఆయ‌న నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థ‌లో పనిచేస్తున్నాడు. అయితే బుధ‌వారం అత‌డు నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వ‌చ్చాడు. సోఫాలో ప‌డి ఉన్న కూతురును మృత‌దేహాన్ని చూసి షాక్ గుర‌య్యాడు. క‌న్నీరు మున్నీరు అయ్యాడు. అనంత‌రం బాలేని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘ‌ట‌న స్థలానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. 

తన భార్య త‌న కూతురు, త‌ల్లిదండ్రుల‌తో పాటు కుటుంబంలోని అంద‌రినీ తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసేద‌ని రోహిత్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ వేధింపుల వ‌ల్లే తాను త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలే వేరే చోట నివ‌సిస్తున్నామ‌ని చెప్పాడు. అయితే ఇక్క‌డ కూడా భార్య మార‌లేదని చెప్పాడు. త‌ర‌చూ కూతురును కొట్టేద‌ని తెలిపారు. ఈ విష‌యం త‌న కూతురు చాలా సార్లు చెప్పింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఆమె మాన‌సిక ఆరోగ్యం బాగాలేద‌ని, ఆమెకు ఏదైనా ఆటంకం క‌లిగిన‌ప్పుడు బిడ్డ‌ను విప‌రీతంగా కొట్టేద‌ని ఆయ‌న తెలిపారు. దీంతో భ‌ర్త ఫిర్యాదు మేర‌కు మోహినిని పోలీసులు అరెస్టు చేశారు. 

గత ఏడాది డిసెంబర్‌లో పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పింగళాలోని ఉత్తర్‌బార్ గ్రామంలో ఓ మహిళ తన రెండేళ్ల కుమార్తెను దిండుతో గొంతు నులిమి హ‌త్య చేసిది. ఈ ఘ‌ట‌న‌లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.