Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. త‌ల్లిని చంపి మూడు రోజుల త‌రువాత కుమారుడి ఆత్మ‌హ‌త్య‌.. 77 పేజీల సూసైడ్ నోట్ ల‌భ్యం

తల్లిని చంపి తనయుడు ఆత్మహత్య  చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మూడు రోజుల తేడాతో ఈ రెండు మరణాలు సంభవించాయి. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

Atrocious.. Son's suicide three days after killing his mother.. 77 pages suicide note available
Author
First Published Sep 5, 2022, 4:58 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఓ యువ‌కుడు త‌న త‌ల్లిని హ‌త్య చేసిన మూడు రోజుల త‌రువాత ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ ఇంటి నుంచి దుర్వాస‌న రావ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో ఈ దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఘ‌ట‌నా స్థ‌లం నుంచి పోలీసులు 77 పేజీల సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

బెంగళూరులో వ‌ర్ష బీభ‌త్సం.. వ‌ర‌ద‌ల వ‌ల్ల‌ 2 రోజుల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం

ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో మిథిలేష్ త‌న 25 ఏళ్ల కుమారుడు క్షితిజ్ తో క‌లిసి ఓ ఇంట్లో జీవిస్తోంది. కుమారుడికి ఉద్యోగం లేదు. దీంతో అత‌డు కొంత కాలం నుంచి డిప్రెషన్ తో బాధ‌పడుతున్నాడు. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు గానీ అత‌డు మూడు రోజుల కింద‌ట హ‌త్య చేశాడు. ఆదివారం రోజు అత‌డూ ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడు.

లింగాయత్ పీఠాధిపతి ఆత్మ‌హ‌త్య‌.. సూసైడ్ నోట్ ల‌భ్యం.. కార‌ణ‌మదేనా?

ఆ ఇంట్లో నుంచి ఆదివారం రాత్రి 8 గంట‌ల‌కు దుర్వాస‌న రావ‌డంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వ‌చ్చి పోలీసు కంట్రోల్ రూమ్ కు స‌మాచారం అందించారు. దీంతో వారు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అయితే దర్యాప్తు అధికారి మెయిన్‌ డోర్‌కి లోపల నుంచి బోల్ట్‌ వేసి ఉండటాన్ని గుర్తించారు. సిబ్బంది బాల్కనీ నుంచి ఇంట్లోకి చొరబడి చూడగా చుట్టుపక్కల రక్తంతో క్షితిజ్ మృతదేహం కనిపించింది. వాష్‌రూమ్‌లో త‌ల్లి మిథిలేష్ మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో క‌నిపించింది.

మనీష్ సిసోడియా‌కు తప్పించుకునే మార్గం లేదు.. స్టింగ్ ఆపరేష్ వీడియో విడుదల చేసిన బీజేపీ

ఘ‌ట‌నా స్థ‌లంలో  క్షితిజ్ రాసిన దాదాపు 77 పేజీల సూసైడ్ నోట్ ల‌భించింది. ఆ నోట్‌లో క్షితిజ్ గురువారం తన తల్లిని హత్య చేసినట్లు అంగీకరించాడు. తర్వాత తాను ఆత్మ‌హ‌త్య చేసుకోబోతున్న‌ట్టు పేర్కొన్నారు. అందులో త‌ను డిప్రెషన్ విష‌యాన్ని ప్ర‌స్తావించాడు. తాను నిరుద్యోగిగా ఉన్నందున జీవితాన్ని ముగించాల‌ని భావిస్తున్న‌ట్టు పేర్కొన్నాడు.

లిక్కర్ బ్రోకరేజ్, కమీషన్ తీసుకోవడమే కేజ్రీవాల్ మిషన్: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ఈ ఘ‌ట‌న‌పై డీసీపీ ప్రణవ్ తాయల్ మాట్లాడుతూ..  యువ‌కుడు మెడను కత్తితో కోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తెలిపారు. క్రైమ్ టీమ్‌లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టీమ్‌లను ఘ‌ట‌నా స్థ‌లానికి పంపించామ‌ని చెప్పారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు డీసీపీ చెప్పారు. ఇంకా అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి సంబంధించిన మిగితా వివ‌రాల‌ను బంధువుల‌ను అడిగి తెలుసుకుంటామ‌ని తెలిపారు. 

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios