ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనక ఆమ్ ఆద్మీ పార్టీ పాత్ర ఉందని బీజేపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్‌లలో ఢిల్లీ ప్రభుత్వ పాత్రను ఈ వీడియో బహిర్గతం చేస్తుందని పేర్కొంటూ.. ఓ ‘‘స్టింగ్ ఆపరేషన్’’ వీడియోను షేర్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనక ఆమ్ ఆద్మీ పార్టీ పాత్ర ఉందని బీజేపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్‌లలో ఢిల్లీ ప్రభుత్వ పాత్రను ఈ వీడియో బహిర్గతం చేస్తుందని పేర్కొంటూ.. ఓ ‘‘స్టింగ్ ఆపరేషన్’’ వీడియోను షేర్ చేసింది. మీడియా సమావేశంలో ఈ వీడియోను విడుదల చేసింది. లిక్కర్ స్కామ్‌లో నిందితుడు ఢిల్లీ ప్రభుత్వం కమిషన్ తీసుకున్నట్టుగా అంగీకరించాడని తెలిపింది. బీజేపీ నేత సంబిత్ పాత్రా ఈ వీడియోను విడుదల చేసి.. “ఢిల్లీ ప్రభుత్వం ఎలా అవినీతికి పాల్పడుతుందో” తెలుస్తుందని అన్నారు. ఇక, ఆ వీడియోలో కుల్విందర్ మార్వా ఉన్నారని.. ఆయన కొడుకు సన్నీ మార్వా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్నారని చెప్పారు.
‘‘మద్యం బాటిల్‌తో ఒక్క సీసా ఉచితంగా ఇస్తున్నా.. లాభాలు గడిస్తున్నారని.. ఎలా దోచుకుంటున్నారో ఆలోచించండి’’ అని సంబిత్ పాత్ర అన్నారు. ఇప్పుడు, మనీష్ సిసోడియాకు తప్పించుకునే మార్గం లేదని అన్నారు. ‘‘కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాక.. ఏదైనా అవినీతికి వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్ చేయాలని ప్రజలను కోరారు. సరిగ్గా ఇదే జరిగింది. స్టింగ్ మాస్టర్ కేజ్రీవాల్ జీపై స్టింగ్ ఆపరేషన్ జరిగింది’’ అని సంబిత్ పాత్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘వీడియోలో వెల్లడించిన విధానం ఏమిటంటే.. 80శాతం లాభం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, వారి స్నేహితుడికి వెళ్తుంది. మొదట మీరు మాకు 80 శాతం కమీషన్ ఇవ్వండి.. ఆపై 20 శాతం మీకు వీలైతే అమ్ముకోండి. మేము పట్టించుకోము. ఇది కేజ్రీవాల్ పాలసీ’’అని ఆరోపించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను ప్రదర్శించిన తర్వాత సంబిత్ పాత్రా అన్నారు. ఈ విషయాలన్నీ కుల్విందర్ మార్వా స్వయంగా అంగీకరించారని తెలిపారు.
