ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. కానీ దట్టమైన మంచు పొగ ఉండటంతో వెనకాల వచ్చిన వాహనాలు డెడ్ బాడీపై నుంచే ప్రయాణించాయి. 

ఉత్తరప్రదేశలో దారుణం జరిగింది. ఓ రోడ్డు ప్రమాదంలో యువకుడు మరణించాడు. అయితే అతడి మృతదేహం రోడ్డుపైన పడి ఉన్నప్పటికీ వందల వాహనాలు పైనుంచే వెళ్లిపోయాయి. పొగమంచు కారణంగా మృతదేహం కనిపించకపోవడంతో ఇది చోటు చేసుకుంది. దీంతో మృతదేహం ముక్కలు ముక్కలుగా మారింది.

తమిళనాడు కడలూరులో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా-దిల్లీ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గోవింద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల చరణ్‌ నర్వారియా అనే యువకుడు బైక్ పై జనవరి 1వ తేదీన రాత్రి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అతడు చనిపోయాడు. అయితే దట్టమైన పొగమంచు వల్ల అతడి మృతదేహం ఎవరికీ కనిపించలేదు. 

పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఘటన..

ఆ సమయంలో రోడ్డుపైన ప్రయాణించే వందల వాహనాలు అతడి మృతదేహం నుంచే వెళ్లాయి. దీంతో శరీరం నుజ్జు నుజ్జు అయిపోయింది. రాత్రంతా ఇలా వాహనాలు వెళ్తూనే ఉండటంతో శరీరం ముక్కలు ముక్కులుగా మారి రహదారి పొడవునా విస్తరించాయి. ఆ ప్రాంతంలోని దాబాల్లో పని చేస్తున్న కొందరు వ్యక్తులు సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నడిరోడ్డుపై ముక్కలు ముక్కలుగా పడి ఉన్న మృతదేహాన్ని చూశారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్‌లోని మృతుడి బంధువులకు సమాచారం అందించామని స్టేషన్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ షాహి తెలిపారు.

తల్లిని కోల్పోయిన బాధలో ఆయనున్నారు.. ఇప్పుడు పాత బకాయిల గురించి ఇబ్బంది పెట్టబోను

ఇలాంటి ఘటనే ఢిల్లీలోని కంఝావ్లా-సుల్తాన్‌పురిలో కూడా రెండు రోజుల కిందట వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ రోజు తెల్లవారుజామున స్కూటీ నడుపుతున్న యువతిని ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆమె కారు కింది భాగంలో చిక్కుకుపోయింది. ఆ కారు అలాగే కొన్ని కిలోమీటర్ల మేర ఆమె బాడీని ఈడ్చుళ్లింది. దీంతో ఆ యువతి మరణించింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.