Asianet News TeluguAsianet News Telugu

అస్సాంలో దారుణం.. ఏనుగుల దాడిలో చిన్నారితో పాటు మరో ఇద్దరు మృతి..

అస్సాం రాష్ట్రం గోల్‌పరా జిల్లాలో ఏనుగుల గుంపు దాడి చేయడంతో ముగ్గురు చనిపోయారు. ఇందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు వాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. 

Atrocious in Assam.. A child and two others died in an elephant attack..
Author
First Published Dec 16, 2022, 10:55 AM IST

అస్సాంలో దిగ్భ్రాంతికరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గోల్‌పరా జిల్లాలో అడవి ఏనుగుల దాడిలో ఓ చిన్నారితో పాటు మరో ఇద్దరు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. రెండు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని లఖిపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధృబా దత్తా ధృవీకరించారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది.

ఒక్క రాత్రి ప్రియుడితో గడిపి.. ఉదయం అతని ఏడేళ్ల కొడుకుతో జంప్..

వివరాలు ఇలా ఉన్నాయి.. లఖీపూర్ కు చెందిన ఓ కుటంబం గురువారం ఆటోలో దుద్నోయి వైపు గోల్‌పరా జిల్లాలోని స్టేట్ హైవే 12పై వెళ్తోంది. అలాగే ఓ కారు గౌహతి వైపు వెళ్తోంది. అయితే ఈ రెండు వాహనాలు ఛోటో సిగ్రీ వద్దకు చేరుకోగానే ఓ ఏనుగుల గుంపు రోడ్డు దాటుతోంది. దీంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు.

రీల్స్ వ్యసనం.. ట్రాక్ పక్కన నిలబడి వీడియోలు తీస్తుండగా రైలు ఢీ.. ముగ్గురు దుర్మరణం

అయితే ఆ సమయంలో ఆగ్రహించిన ఏనుగులు ఆటోరిక్షాపై దాడి చేసి బోల్తా కొట్టించాయి. దీంతో ఆటోరిక్షాలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల పరిగెడుతూ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. అయినా తొక్కిసాలటలో ఆటోలో ఉన్న ఇద్దరు చనిపోయారు. అలాగే పక్కనే ఉన్న కారుపై కూడా దాడి చేయడంతో ఒకరు మరణించారు. ఈ తొక్కిసలాటలో మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొంత సమయం తరువాత ఏనుగులు గుంపు వెళ్లిపోయింది. దీంతో స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.

ఆటో రిక్షాలో మరణించిన వారిని రమణి రభా (29), అతడి 17 నెలల కుమార్తె జినీషా, జైబర్ అలీగా (38) గుర్తించారు. గాయపడిన వారిని మనీషా రభా, ఆమె ఐదేళ్ల కుమారుడు ధనుష్‌గా గుర్తించారు. క్షతగాత్రులను లఖిపూర్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై లఖిపూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ధృబా దత్తా మాట్లాడుతూ.. “ఈరోజు గోల్‌పరాలో అడవి ఏనుగుల దాడిలో ఒక చిన్నారితో పాటు ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలో రెండు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.’’ అని తెలిపారు. ‘‘42 ఏనుగులతో కూడిన గుంపు ఇప్పటికీ రెండు గ్రూపులో విడిపోయి ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. అటవీ, పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్నారు. మేము గట్టి నిఘా ఉంచాము. మంద యొక్క కదలికను పర్యవేక్షిస్తున్నాము’’ అని అటవీ శాఖ అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios