సారాంశం

ఓ వివాహితపై ఇద్దరు దుండగులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆమె మనస్థాపానికి గురయ్యింది. తన భర్తతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో జరిగింది.

ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ఆ మహిళ తన భర్తతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. అత్యాచారం జరిగిన కొన్ని గంటల్లోనే వారిద్దరూ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. యూపీలోని బస్తీ జిల్లా రుధౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో 27 ఏళ్ల మహిళ, 30 ఏళ్ల తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇందులో ఎనిమిదేళ్లు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. కాగా.. ఈ నెల 20, 21 తేదీల మధ్య రాత్రి ఈ దంపతులు నివసిస్తున్న ఇంట్లోకి ఇద్దరు దుండుగులు చొరబడ్డారు. అనంతరం ఇంట్లో ఉన్న వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మృతురాలి బంధువులు ఆరోపించినట్లు  బస్తీ ఎస్పీ గోపాల్ కృష్ణ వెల్లడించారు. 

అయితే దీంతో ఆ దంపతులు మనస్థాపానికి గురయ్యారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. దాని కంటే ముందు వారిద్దరూ ఓ వీడియో రికార్డు చేశారు. అందులో నిందితుల పేర్లు, వివరాలు వెల్లడించారు. అయితే శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు సిద్ధమవుతున్న సమయంలో తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని తల్లిదండ్రులు తెలిపారు. 

అనంతరం వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బంధువులు, మృతుల పిల్లల నుంచి సమాచారాన్ని సేకరించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం ఇద్దరి నిదింతులపై  376 డి (సామూహిక అత్యాచారం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆదర్శ్ (25), త్రిలోకి (45)లను అరెస్టు చేశారుు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా.. ఈ దంపతులకు చెందిన భూమి అమ్మకంతో అత్యాచార ఘటనకు సంబంధం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726) నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు.