దారుణం.. కన్న బిడ్డలకు విషమిచ్చి చంపిన కసాయి తండ్రి.. ముగ్గురు మృతి, మరొకరి పరిస్థితి విషమం..
హర్యానాలో దారుణం జరిగింది. ఓ కన్న తండ్రి తన నలుగురు పిల్లలకు విషమిచ్చాడు. దీంతో ముగ్గురు పిల్లలు చనిపోయాడు. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. మరొకరు ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నారు. ఎనిమిదేళ్ల వయస్సున్న బాలిక ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.
ఓ వ్యక్తి తన బిడ్డల పాలిట కాలయముడిగా మారాడు. పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. మనిషిననే విషయాన్ని మర్చిపోయి కసాయిలా సొంత పిల్లలను విషమిచ్చి చంపాడు. మొత్తంగా నలుగురు పిల్లలకు విషం ఇవ్వగా.. ముగ్గురు మరణించారు. మరొకరు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటన హర్యానాలో కలకలం రేకెత్తించింది.
వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని రోహ్ తక్ జిల్లా కాబూల్పూర్ గ్రామంలో కుమార్ తన భార్య నలుగురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. నలుగురు పిల్లలో 10, 7,8 ఏళ్ల వయస్సున్న ముగ్గురు కూతుర్లు, ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. కుమార్ కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో గాని అతడిలో ఓ క్రూరమైన ఆలోచన వచ్చింది. మంగళవారం తన భార్య ఇంట్లో లేని సమయంలో నలుగురు పిల్లలకు విషం ఇచ్చాడు.
ఉద్విగ్న భరితక్షణాలు : వందేమాతరంతో మారుమోగిన వాంఖడే.. ఒకేసారి 32వేలమంది ఆలాపన...
దీంతో 10, 7 ఏళ్ల వయస్సున్న ఇద్దరు అక్కాచెల్లెల్లు, ఏడాది వయస్సున్న వారి సోదరుడు అక్కడే చనిపోయారు. 8 ఏళ్ల వయస్సున్న ఓ సోదరి ప్రస్తుతం పీజీఐఎంఎస్ లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. 10 ఏళ్ల లోపు వయస్సున్న ముగ్గురు పిల్లలు ఇలా హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేకెత్తించింది.