అతడికి చెవులు వినిపించవు. మాటలు కూడా రావు. ఏదో పని మీద బయటకు వెళ్లిన అతడు..రోడ్డు పక్కన తన సైకిల్ నిలిపి దానిపై కొన్ని వస్తువులు పెడుతున్నాడు. ఇదే సమయంలో రోడ్డుపై స్కూటీపై వెళ్తున్న ఓ బాలిక కు ఈ సైకిల్ అడ్డంకిగా మారింది. సైకిల్ తీయాలని హారన్ కొట్టినా అతడు వినిపించుకోకపోవడంతో కోపంతో అతడిని కత్తితో పొడిచేసింది.
ఛత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. రోడ్డు కు అడ్డంగా ఉండి ఎంత హారన్ కొట్టినా దారి ఇవ్వలేదని ఆ యువతి ఆక్రోశంతో రెచ్చిపోయింది. అతడికి చెవులు వినబడవని తెలుసుకోకుండా దుర్భాషలాడుతూ ఆగ్రహంతో కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా సంచలనం సృష్టించింది.
అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ.. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము..
ఈ ఘటనకు సంబంధించి ఆజాద్ చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అశ్విని రాథోడ్ వివరాలు వెల్లడించారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా‘ తన కథనంలో పేర్కొంది. రాయ్‌పూర్‌లోని కంకలిపరా ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఇది చోటు చేసుకుందని తెలిపారు. బాధితుడిని స్థానికంగా నివాసం ఉండే సుదామ లాడర్‌గా పోలీసులు గుర్తించారు. అయితే అతడి మాట్లాడలేడు. చెవులు కూడా వినిపించవు. అతడు ఆ ప్రాంతంలో రోడ్డుపై తన సైకిల్‌పై ఉంచి దానిపై కొన్ని వస్తువులను లోడ్ చేసుకుంటున్నాడు. అదే సమయంలో 15 ఏళ్ల బాలిక, ఆమె తల్లితో కలిసి స్కూటర్‌పై వెళ్తోంది.
జల్సాల కోసం ప్రియుడితో దొంగతనాలు.. ఓ ప్రియురాలి స్కెచ్.. చివరికి అడ్డంగా దొరికిపోయి...
అయితే రోడ్డుపై సైకిల్ ఉండటంతో ఆమె స్కూటీ వెళ్లేందుకు ప్లేస్ సరిపోలేదు. దీంతో ఆమె హారన్ కొట్టింది. కానీ అది అతడికి వినిపించకపోవడంతో స్పందించలేకపోయాడు. ఆమె పైపు కనీసం చూడలేదు కూడా. దీంతో ఆమె పదే పదే హారన్ కొట్టింది. అయినా వినిపించకపోవడంతో ఆయన పనిలో నిమగ్నం అయ్యాడు. దీంతో ఆగ్రహించిన బాలిక స్కూటర్ ను ఆపి సుదామను దగ్గరికి వెళ్లి గట్టిగా అరిచింది. అయినా అతడికి వినిపించకపోవడంతో మళ్లీ స్పందించలేదు. దీంతో ఆక్రోషంతో రెచ్చిపోయిన బాలిక కత్తి తీసి అతడి గొంతులో పొడిచింది.
దీంతో సుదామ అక్కడికక్కడే రోడ్డుపై పడిపోయాడు. దీంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ మార్గ మధ్యలోనే పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. ఇదే సమయంలో ఆ బాలిక తల్లిని వదిలి అక్కడి నుంచి పారిపోయింది. ఎవరికి దొరక్కకుండా తప్పించుకోవాలని ఎక్కడికో వెళ్లి దాక్కుంది. కానీ ఆమె సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిర్ హసౌద్ వద్ద పోలీసులకు చిక్కింది. అయితే బాలిక కూడా అదే ప్రాంతానికి చెందినదని పోలీసులు తెలిపారు. కాగా బాలిక నేర నేపథ్యం గురించి మీడియా ప్రశ్నించినప్పుడు.. ఎన్ స్పెక్టర్ సమాధానం ఇచ్చారు. నిందితురాలు మైనర్ అయినందున ఆమె వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. మృతుడు సుదామకు 40 ఏళ్ల వయస్సు ఉంటుందని, వివాహితుడని చెప్పారు.
15ఏళ్ల బాలుడు... రూ.33లక్షల జీతంతో ఉద్యోగం..కానీ..!
బాధితురాలిపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 (హత్య), ఆయుధాల చట్టం కింద ఆజాద్ చౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ ను నేడు (సోమవారం) జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.
