గుజరాత్ లో మానవ అక్రమ రవాణా ముఠా చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా ఓ 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి, 15 మందికి విక్రయించింది. బాధితురాలని ఉపయోగించుకొని పలువురు బాలికను అపహరించింది. బాధితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. 

గుజరాత్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికల కిడ్నాప్, విక్రయాలు పెద్ద ఎత్తున వెలుగుచూశాయి. ఈ మానవ అక్రమ రవాణా ఘటన ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఓ ముఠా దాదాపు 8 మంది బాలికలను వారి ఇళ్ల నుంచి కిడ్నాప్ చేసి విక్రయించినట్లు విచారణలో తేలింది. అందులో 13 ఏళ్ల మైనర్ బాలిక నిషా (పేరు మార్చాం)ని కూడా ఉంది. ఆమెను గత 8 ఏళ్లలో 15 మంది పెద్దలకు విక్రయించారు. ఆ పురుషుల వయస్సు 30 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంది. నిషాను ప్రతిసారీ వధువుగా తయారు చేసి 15 మందితో బలవంతంగా పెళ్లి జరిపించారు. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు. 

ఆగని అఘాయిత్యాలు.. భర్తను బంధించి.. తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం..

ఈ ముఠా బాధిత బాలికల సంఖ్య 8కి పైగా ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. ఒక్కో అమ్మాయితో ముఠా పదే పదే బేరసారాలు సాగించింది. ఈ రాకెట్‌కు సూత్రధారి అయిన నిందితుడు అశోక్ పటేల్ నిషాను ఉపయోగించుకుని గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన మరో 15 మంది బాలికలను అపహరించి విక్రయించాడు. బాధితుల్లో నిషా ఒక బాలిక. మిగిలిన అమ్మాయిల సమాచారం ఇంకా తెలియరాలేదు. 

ఈ కేసు ఎలా బయటపడిందంటే ?
ఈ నెల 11న అహ్మదాబాద్ జిల్లాలోని కన్భా గ్రామంలో ఓ యువతి అదృశ్యమైంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా మే 13వ తేదీన గాంధీనగర్ సమీపంలోని బోరు గ్రామంలో వారికి నిషా కనిపించింది. ఆమెను అక్కడి నుంచి రక్షించి, విచారించండంతో ఈ రాకెట్ గుట్టు రట్టయింది. వారి విచారణలో బాలిక అపహరణకు గురైందని తెలిసింది. తరువాత ఆమెపై అత్యాచారం జరిగింది. ఆమెను హింసించి, ప్రతీ ఏటా ఇద్దరు పురుషులతో వివాహం జరిపించారని తేలింది. 

కాగా.. ఈ రాకెట్‌కు సూత్రధారి అశోక్ పటేల్, అతని భార్య రేణుక (45), వారి కుమారుడు (16), ఓధవ్ ప్రాంతంలో నివసించే రూపల్ మెక్వాన్ (34) అనే మహిళ అని తేలింది. ప్రస్తుతం అతడి సహచరులు మోతీ సేన్మా (50),, అమర్త్‌జీ ఠాకోర్ (70), చెహర్ సింగ్ సోలంకీ (34)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దర్యాప్తులో రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు విచారణలో తేలింది. అయితే ఇంత వరకు తప్పిపోయిన 8 మంది బాలికల్లో 7 మంది ఇంకా జాడ తెలియలేదు. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఈ కేసులో నిషాను నిందితుడు అశోక్ పటేల్ అహ్మదాబాద్ నుంచి కిడ్నాప్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. అతడు చెప్పినట్టు వినేంత వరకు బాలికను లైంగిక దోపిడి చేశాడు. తరువాత నిషాను జనాల ముందు పెళ్లికూతురుగా చూపించి, డీల్ కుదుర్చుకునేవాడు. ఇలా దాదాపు 15 మందితో ఆమెకు బలవంతంగా పెళ్లి చేశాడు. దీంతో పాటు నిషాను ఉపయోగించుకొని పలువురు అమ్మాయిలను కిడ్నాప్ చేయడం ప్రారంభించాడు. ఇలా కిడ్నాప్ చేసి, అశోక్ విక్రయించిన ముంబైకి చెందిన బాలిక కోసం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర , రాజస్థాన్‌లకు చెందిన మానవ అక్రమ రవాణాదారులతో అశోక్‌కు పరిచయం ఉందని, ఈ కోణంలో ఇంకా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు.

ఎన్ఐఏ విచారణలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ సంచలన విషయాలు.. హిట్ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ ఫస్టంట..

45), వారి 16 ఏళ్ల కుమారుడు, రూపాల్ మెక్వాన్(34) ఈ రాకెట్ సూత్రధారులు. వీరంతా అహ్మదాబాద్ లోని ఓదావ్ ప్రాంతానికి చెందినవారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మాన్సాకు చెందిన మోతీ శర్మ(50), అమ్రాట్జీ ఠాకూర్(70), పాలన్పూర్కు చెందిన చెహర్ సింగ్ సోలంకి(34)లను అరెస్టు చేశారు.