ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. మహిళ భర్తను బంధించి దారుణానికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను ఆమె 13 ఏళ్ల కుమార్తెపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాజం సిగ్గుతో తలదించుకోనే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. ఈ గ్రామంలోని స్థానిక వ్యాపారి ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడి ఈ ఘటనకు పాల్పడ్డారని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వివరాల్లోకెళ్లే.. రాంపూర్‌లోని సైఫ్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యాపారవేత్త తన భార్య, కుమార్తె కొడుకుతో నివసిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు దొంగలు తన ఇంట్లోకి చొరబడి రూ.5 వేల నగదు, మొబైల్ ఫోన్, కొన్ని విలువైన వస్తువులను లాక్కెళ్లారని పోలీసులకు తెలిపాడు. దీంతో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కొన్ని గంటల తర్వాత, దొంగల్లో ఒకరు తనకు తెలుసుని, ఆ దుండగులు తన భార్య, మైనర్ కుమార్తెపై మూడు గంటల పాటు సామూహిక అత్యాచారం చేశారని వ్యాపారవేత్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అనంతరం ఎస్పీ (రాంపూర్) అశోక్ కుమార్ శుక్లా, ఏఎస్పీ సన్సార్ సింగ్ బాధితురాలి గ్రామానికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. పోలీసులు కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశారు. ఆ తర్వాత పోక్సో చట్టంలోని సెక్షన్‌లతో చేర్చారు. తన భార్య, కూతురిపై జరిగిన అత్యాచారం గురించి మొదట్లో ఆ వ్యాపారవేత్త చెప్పలేదని ఏఎస్పీ సన్సార్ సింగ్ తెలిపారు. అత్యాచార బాధితులకు మెడికో-లీగల్ పరీక్షలు నిర్వహించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో దర్యాప్తులో నిందితులలో మైనర్‌గా కనిపించే ఒకరు బహుశా బాధితురాలి భార్యతో గొడవ పడ్డారని , ఇరువర్గాలు ఆ విషయాన్ని సెటిల్ చేసుకున్నాయని ఆయన చెప్పారు. తాము అన్ని కోణాల నుండి విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఈ తరుణంలో రాంపూర్ ఎస్పీ అశోక్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. తన ఇంట్లోకి కొందరు వ్యక్తులు చొరబడి బందీగా పట్టుకుని దోచుకున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసాము. ఆ తర్వాత తన భార్య, కుమార్తెపై కూడా అత్యాచారం జరిగిందని తెలిపారు. ముగ్గురు వ్యక్తులు వచ్చారని, ఒకరి పేరు కూడా చెప్పారని బాధితురాలు తెలిపింది. ఆ వ్యక్తితో కొన్ని రోజుల క్రితం గొడవ జరిగిందని బాధితురాలు చెప్పిందని తెలిపారు.
