తల్లికి క్యాన్సర్ చికిత్స చేయించే డబ్బులు లేక.. ఏటీఎం దొంగతనానికి పాల్పడ్డాడో వ్యక్తి. యూ ట్యూబ్ లో ట్యుటోరియల్స్ చూసి మరీ దొంగతనానికి వచ్చి, పట్టుబడ్డాడు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని నవాబ్‌గంజ్‌లో కెనరా బ్యాంక్ ఏటీఎంను పగల గొట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఓ వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు. సుభమ్ అనే సదరు వ్యక్తి తన తల్లి క్యాన్సర్ చికిత్స కోసం అవసరమైన డబ్బులు లేకపోవడంతో.. ఏటీఎం దొంగతనం చేయాలని ఆలోచించినట్లు తెలిపాడు.
అందుకే తాను ఈ నేరానికి పాల్పడుతున్నానని.. తాను ఇందులో విఫలమై పోలీసులకు దొరకడం, అరెస్టు కావడం బాధిస్తుందని పోలీసులకు చెప్పాడు. బెంగళూరులోని కెనరా బ్యాంక్ కంట్రోల్ రూం నుంచి కాన్పూర్ పోలీసులను అప్రమత్తం చేస్తూ ఫోన్ వచ్చింది.
ఉత్తరాఖండ్ : లోయలో పడిన బస్సు.. ఏడుగురు యాత్రికులు దుర్మరణం
ఈ సమాచారం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3 గంటలకు సుభమ్ ఏటీఎందగ్గరికి చేరుకున్నాడు. తనను ఎవరూ గమనించడం లేదని నిర్థారించుకున్న తరువాత ఏటీఎం మెషీన్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న నవాబ్‌గంజ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే సుభమ్ పారిపోయాడు. దీంతో సీసీ కెమెరాల సాయంతో దొంగతనానికి ప్రయత్నించిన సుభామ్ కోసం గాలింపు చేపట్టారు. చివరికి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఆమెకు శస్త్ర చికిత్సకు డబ్బులు కావాలని పోలీసులకు చెప్పాడు.
డబ్బులు సమకూర్చుకునే దారులు లేకపోవడంతో ఏటీఎంలను ఎలా కట్ చేయాలో యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూడటం ప్రారంభించాడు. ఆ తరువాత దొంగతనానికి ప్రయత్నించాడు. పోలీసుల విచారణలో అతను మాట్లాడుతూ... తనను అరెస్టు చేసినందుకు తాను బాధపడడం లేదని... కాకపోతే తల్లి చికిత్సకు డబ్బులు ఏర్పాటు చేయలేకపోయినందుకు విచారిస్తున్నానని చెప్పాడు. సుభామ్‌కు అంతకు ముందు నేర చరిత్ర లేదు.
