బిహార్‌లోని పాట్నాలో ఏటీఎంలో డబ్బులు వేయడానికి వెళ్లిన క్యాష్ వ్యాన్ కొన్ని క్షణాల తర్వాత కనిపించకుండా పోయింది. ఆ వ్యాన్ నుంచి సిబ్బంది దిగి బ్యాంకులోకి వెళ్లగా.. అందులో ఒక్క డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత రూ. 1.5 కోట్ల డబ్బుతో ఉన్న ఆ కారును డ్రైవర్ వేగంగా అక్కడి నుంచి పరుగులు పెట్టించారు. ఆ వ్యాన్‌ను పోలీసులు రికవరీ చేసుకున్నారు. కానీ, డ్రైవర్ మాత్రం కనిపించలేదు. 

పాట్నా: బిహార్‌లో రూ. 1.5 కోట్ల నగదు ఉన్న ఏటీఎం క్యాష్ వ్యాన్, అందులోని డ్రైవర్ కనిపించకుండా పోయాడు. ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి ఆ క్యాష్ వ్యాన్ అక్కడకు వచ్చింది. అయితే, క్యాష్ వ్యాన్ నుంచి సెక్యూరిటీ గార్డు, ఇతర సిబ్బంది అంతా దిగి బ్యాంకులోకి వెళ్లారు. అప్పుడు క్యాష్ వ్యాన్‌లో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. వారు బయటకు వచ్చి చూసేసరికి అక్కడ వ్యాన్ లేదు. డ్రైవరూ లేడు.

పోలీసులు, సెక్యూర్ వ్యాల్యూ కంపెనీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఆ క్యాష్ వ్యాన్ బ్యాంకుకు కొద్ది దూరంలో పార్క్ చేశారు. పాట్నాలోని డంకా ఇమ్లీలోని ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్లారు. వారు బ్యాంకులో నుంచి డబ్బు విత్ డ్రా చేశామని అన్నారు. అప్పుడు క్యాష్ వ్యాన్‌లో రూ. 1.5 కోట్లు ఉన్నాయి. ఆ డబ్బును రెండు ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సి ఉన్నది. 

కారు డ్రైవర్‌గా సూరజ్ కుమార్ ఉన్నాడు. ఆయన వెంటే ఆ కారులో గన్ మ్యాన్ సుభాష్ యాదవ్, ఆడిటర్ అమ్రేష్ సింగ్, మరో ఇద్దరు ఉద్యోగులు సోను కుమార్, దిలీప్ కుమార్‌లు ఉన్నారు. కానీ, బ్యాంకు వద్దకు వచ్చిన తర్వాత వారంతా వ్యాను లోనుంచి దిగిపోయారు. కేవలం సూరజ్ కుమార్ ఒక్కడే రూ. 1.5 కోట్ల డబ్బుతో కారులో ఉన్నాడు. 

Also Read: ఆస్తి కోసం అమానుషం.. ప్రపార్టీ పేపర్లపై మరణించిన మహిళ వేలిముద్రలు.. వీడియో వైరల్

క్యాష్ వ్యాన్ కనిపించకపోవడంతో సెక్యూర్ వ్యాల్యూ కంపెనీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఆ కారు బ్యాంకు నుంచి సుమారు కిలోమీటరు పరిధిలోనే దొరికింది. కానీ, డ్రైవర్ కనిపించలేదు. అలాగే, డబ్బులు దాచిన సేఫ్‌ తాళం పగులగొట్టి ఉన్నది. ఆ తాళాన్ని బహుశా సుత్తెతో పగులగొట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఆ డ్రైవర్‌ను పట్టుకోవడానికి పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్ స్పాట్‌కు చేరుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది. ఆ డ్రైవర్‌తోపాటు ఉన్న సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.