కోలుకుంటున్న అటల్‌జీ

Atal Bihari Vajpayee health is safe condition
Highlights

కోలుకుంటున్న అటల్‌జీ 

అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ కోలుకుంటున్నారు.. ఆయన ఆరోగ్యం నిలకగా ఉందని ఎయిమ్స్ వైద్య బృందం తెలిపింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.. ఆయన మూత్ర సంబంధ వ్యాధితో బాధపడుతున్నారని త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటారని బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయ్ వైద్యానికి సహకరిస్తున్నారని... ఇన్ఫెక్షన్ తగ్గేంతవరకు ఎయిమ్స్‌లోనే ఆయనకు చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. మరోవైపు అటల్‌జీ ఆరోగ్య పరిస్థితిపై విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరా తీశారు. 2009 నుంచి వాజ్‌పేయ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రధానంగా డయాబెటిస్, మూత్ర సంబంధిత వ్యాధులతో ఆయన సతమతమవుతున్నారు.. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా వాజ్‌పేయ్‌కి చికిత్స చేస్తున్నారు.

loader