Himachal Pradesh rains: భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు ఆర్మీ, జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులు, హోంగార్డుల సంయుక్త ఆపరేషన్లు కొనసాగుతున్నాయనీ, సమ్మర్ హిల్‌లోని శివాలయం శిథిలాల కింద కనీసం ముగ్గురు వ్యక్తులు ఇంకా చిక్కుకుని ఉంటారని సంబంధిత అధికారులు తెలిపారు.
78 Dead In Himachal Due To Rain: భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు ఆర్మీ, జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులు, హోంగార్డుల సంయుక్త ఆపరేషన్లు కొనసాగుతున్నాయనీ, సమ్మర్ హిల్‌లోని శివాలయం శిథిలాల కింద కనీసం ముగ్గురు వ్యక్తులు ఇంకా చిక్కుకుని ఉంటారని సంబంధిత అధికారులు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సం కారణంగా వరదలు సంభవించడంతో పాటు చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పెద్దమొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య శనివారం 78కి చేరిందనీ, కూలిన ఆలయ శిథిలాల నుంచి మరో మృతదేహం లభ్యమైందని అధికారులు తెలిపారు. మృతుడిని ఈష్ శర్మ (28)గా గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో గణిత విభాగానికి చైర్మన్ గా ఉన్న ఆయన తండ్రి పీఎల్ శర్మ మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. ఆదివారం రాత్రి నుండి మరణించిన 78 మందిలో, 24 మంది సిమ్లాలో మాత్రమే మూడు పెద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. సమ్మర్ హిల్‌లోని శివాలయంలో 17, ఫాగ్లీలో 5, కృష్ణానగర్‌లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని సిమ్లా సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ గాంధీ శనివారం తెలిపారు.
కొండచరియలు విరిగిపడిన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు ఆర్మీ, జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసులు, హోంగార్డుల సంయుక్త ఆపరేషన్లు కొనసాగుతున్నాయనీ, ఆలయ శిథిలాల కింద కనీసం ముగ్గురు వ్యక్తులు చిక్కుకుని ఉంటారని ఎస్పీ తెలిపారు. రాష్ట్ర రాజధానిలో హైరిస్క్ జోన్ల గుర్తింపు, స్లైడింగ్ సైట్ల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. జూన్ 24న హిమాచల్ ప్రదేశ్ లో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 338 మంది వర్షం సంబంధిత సంఘటనలు, రోడ్డు ప్రమాదాల్లో మరణించగా, 38 మంది గల్లంతయ్యారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. రాష్ట్రంలో 11,900 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయనీ, 560 రహదారులు ఇంకా మూసుకుపోయాయని, 253 ట్రాన్స్ఫార్మర్లు, 107 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడిందని ఎమర్జెన్సీ సెంటర్ తెలిపింది.
కాంగ్రా జిల్లాలోని ఇండోరా, ఫతేపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ ఉపముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ లో రూ.10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందనీ, 350 మంది ప్రాణాలు కోల్పోయారని, 50 మంది గల్లంతయ్యారని చెప్పారు. ఆగస్టు 20, 21 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 22, 23 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ శనివారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సిమ్లా, సిర్మౌర్, చంబా జిల్లాల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు రావడం, నదులు, కాలువల్లో నీటి మట్టం పెరగడంతో పాటు పంటలు, పండ్ల మొక్కలు, చిన్న మొలకలకు నష్టం వాటిల్లుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
