లఢఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్- చైనా బలగాల మధ్య జరిగిన బాహాబాహీలో మరణించిన భారత జవాన్ల సంఖ్య పెరిగే అవకాశం వుందని సైనిక వర్గాలు అంటున్నాయి. ఈ ఘర్షణలో సుమారు 20 మంది భారత జవాన్లు చనిపోయారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read:నా కుమారుడు దేశం కోసం అమరుడైనందుకు గర్వంగా ఉంది: కల్నల్ సంతోష్ తల్లి

నిజానికి ఇక్కడ ఎలాంటి కాల్పులు జరగలేదు. కేవలం బాహాబాహీ, పిడిగుద్దులు, రాళ్ళతో కొట్టుకోవడం వంటి చర్యల కారణంగా ఈ మరణాలు సంభవించి వుండొచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

అటు చైనా వైపు కూడా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లుగా తెలుస్తోంది. కానీ చైనా మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. కాగా లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద చైనా సరిహద్దుల్లో భారత్- చైనా సైన్యం బాహాబాహీకి దిగాయి.

Also Read:చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత: భారత కల్నల్ సహా ముగ్గురు మృతి, 1975 తరువాత ఇదే తొలి మరణం!

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో మనదేశానికి చెందిన ముగ్గురు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా భారత సైన్యం ప్రకటించింది. చైనా సైనికుల చేతిలో మరణించిన వారిలో తెలుగు తేజం సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.