Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ, కాశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు.. కానీ : అమిత్ షా కీలక వ్యాఖ్యలు

జమ్మూకాశ్మీర్‌కు (jammu and kashmir) సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (amit shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని లోక్‌సభలో హామీ ఇచ్చానని ఆయన గుర్తుచేశారు. 

Assembly polls In Jammu and Kashmir After Delimitation Process Completion says Amit Shah
Author
New Delhi, First Published Jan 22, 2022, 9:59 PM IST

జమ్మూకాశ్మీర్‌కు (jammu and kashmir) సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (amit shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని లోక్‌సభలో హామీ ఇచ్చానని ఆయన గుర్తుచేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ జిల్లా సుపరిపాలన సూచికను విడుదల చేసిన అమిత్ షా మాట్లాడుతూ..  ఇండెక్స్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, పథకాలు, కార్యక్రమాలను జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు వీలవుతుందన్నారు. అలాగే త్వరలో జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామంటూ వ్యాఖ్యానించారు. 

జమ్మూ, కాశ్మీర్ కోసం డీలిమిటేషన్ కమిషన్ (delimitation commission) ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రపాలిత ప్రాంతం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించే ఉద్దేశ్యంతో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్‌లకు 16 స్థానాలను రిజర్వ్ చేసింది. జమ్మూ ప్రాంతంలో గిరిజనులు.. రాష్ట్రంలో ఆరు అదనపు సీట్లు, కాశ్మీర్ లోయలో ఒక సీటు అదనంగా ప్రతిపాదించారు. దీనిపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (national conference) అయితే.. నివేదికపై ప్రస్తుత రూపంలో సంతకం చేయబోమని తేల్చి చెప్పింది.

జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆగస్టు 2019లో పార్లమెంట్‌లో ఆమోదించిన తర్వాత ఫిబ్రవరి 2020లో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సరిహద్దులో ఆదరణ లేని పరిస్థితుల కారణంగా తగిన కమ్యూనికేషన్, ప్రజా సౌకర్యాల కొరతతో భౌగోళిక ప్రాంతాల ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడానికి కొన్ని జిల్లాలకు అదనపు నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. కాశ్మీర్‌లో తొలిసారిగా జనాభా ప్రాతిపదికన 90 సీట్లలో తొమ్మిది స్థానాలను షెడ్యూల్డ్ తెగలకు , షెడ్యూల్డ్ కులాల కోసం ఏడు సీట్లు ప్రతిపాదించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios