Puducherry: కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోరుతూ పుదుచ్చేరి అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర ఏర్పాటు తీర్మానంపై యూటీ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తారని ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి చెప్పారు. 

Puducherry Assembly: పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోరుతూ పుదుచ్చేరి అసెంబ్లీలో శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానానికి ఆమోదం తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)కు రాష్ట్ర హోదా తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందడం ఇది 14వ సారి కావ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర ఏర్పాటు తీర్మానంపై యూటీ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తారని ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి చెప్పారు.

వివ‌రాల్లోకెళ్తే.. కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోరుతూ పుదుచ్చేరి అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. మార్చి 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల చివరి రోజున డీఎంకే ఎమ్మెల్యే సహా ఐదుగురు ఎమ్మెల్యేలు పుదుచ్చేరి రాష్ట్ర ఏర్పాటుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యూటీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ తీర్మానానికి అధికార ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి, కాంగ్రెస్, అన్నాడీఎంకే, స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంగా కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి అసెంబ్లీలో తెలిపారు.

పాలించే హక్కు మనకు అవసరమనీ, అందుకు రాష్ట్ర హోదా ఒక్కటే మార్గమన్నారు. అసెంబ్లీలో పలుమార్లు లేవనెత్తామని, కానీ పరిశీలిస్తామని కేంద్రం చెప్పేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వ తీర్మానంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామ‌ని రంగ‌స్వామి తెలిపారు. "మంచి సమయం వచ్చేసింది. మంచి పనులు జరుగుతాయి. కేంద్రం మాకు మద్దతు ఇస్తోంది. మా అభ్యర్థనను అంగీకరించే స్థితిలో ఉంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర హోదా కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది" అని తెలిపారు.

రాష్ట్ర ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తారని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి పుదుచ్చేరికి రాష్ట్ర హోదా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)కు రాష్ట్ర హోదా తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందడం ఇది 14వ సారి కావ‌డం గ‌మ‌నార్హం.