Assembly Election Results 2023: నార్త్​లో బీజేపీ, సౌత్‌లో కాంగ్రెస్ హ‌వా.. నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు

Assembly Election Results 2023: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్ గఢ్ లలో బీజేపీ హవా కొనసాగింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన అధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటివరకు అందిన నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ స్ప‌ష్ట‌మైన అధిక్యంతో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోతోంది. 
 

Assembly Election Results 2023: BJP's Rajasthan, Chhattisgarh, Madhya Pradesh 3-states stunner, Congress goes home with Telangana RMA

Election Results 2023: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లలో భారతీయ జనతా పార్టీ హ‌వా కొన‌సాగించింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన అధిక్యంతో ముందుకు సాగుతోంది. ఆదివారం వెలువ‌డిన నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు గ‌మ‌నిస్తే ఉత్త‌ర భార‌తంలో బీజేపీ జోరు కొన‌సాగింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ డీలా ప‌డింది. తెలంగాణ‌లో మాత్రం స్ప‌ష్ట‌మైన అధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయ‌బోతున్న‌ద‌ని ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ పేర్కొంటున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డిన నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు గ‌మ‌నిస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంద‌ని ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌నుంది. ఇప్ప‌టికే ఈ పార్టీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాల్లో విజ‌యం సాధించింది. 

Telangana Assembly Election Result 2023 (తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు) :

 తెలంగాణ ఎన్నిక‌ల్లో  బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ స్ప‌ష్ట‌మైన అధిక్యంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు అందిన తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌కారం.. కాంగ్రెస్ 63 స్థానాల్లో విజ‌యం సాధించింది. బీఆర్ఎస్ 35 స్థానాల్లో విజ‌యం సాధించింది. బీజేపీ 8, ఎంఐఎం 3 స్థానాల్లో విజ‌యం సాధించాయి. 

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

Chhattisgarh Election Results 2023 (ఛ‌త్తీస్ గ‌ఢ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు) :

ఛ‌త్తీస్ గ‌ఢ్ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ త‌గిలింది. ప్ర‌జా వ్య‌తిరేక నేప‌థ్యంలో బీజేపీ త‌న హ‌వాను కొన‌సాగించింది. ఇప్ప‌టివ‌ర‌కు అందిన ఛ‌త్తీస్ గ‌ఢ్ ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌కారం.. బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్ప‌ష్ట‌మైన అధిక్యంతో ముందుకు సాగుతోంది. బీజేపీ 55 స్థానాల్లో అధిక్యంలో ఉండ‌గా, కాంగ్రెస్ పార్టీ 33 స్థానాలు, ఇత‌రులు రెండు స్థానాల్లో ముందంజ‌లో ఉన్నారు. 

Madhya Pradesh Election Results 2023 (మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు):

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు గ‌మ‌నిస్తే మ‌రోసారి క‌మ‌ల్ నాథ్ స‌ర్కారు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. ప్ర‌స్తుతం వెలువ‌డుతున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు గ‌మ‌నిస్తే.. బీజేపీ 166 స్థానాలు, కాంగ్రెస్ 63 స్థానాల్లో, ఇత‌రులు ఒక స్థానంలో అధిక్యంలో ఉన్నారు.  

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

Rajasthan Election Results 2023 (రాజ‌స్థాన్ ఎన్నిక‌ల ఫ‌లితాలు):

వ‌రుస‌గా రెండో సారి అధికారంలోకి రాని ట్రెండ్ మ‌రోసారి రాజ‌స్థాన్ లో కొన‌సాగింది. అక్క‌డి ప్ర‌జ‌లు అధికార కాంగ్రెస్ ను ప‌క్క‌న పెడుతూ బీజేపీకి స్ప‌ష్ట‌మైన అధిక్యం క‌ల్పించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు గ‌మ‌నిస్తే.. బీజేపీ 115 స్థానాల్లో అధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 71 స్థానాలు, ఇత‌రులు 13 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios