ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రభావం కన్పించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాది పాటు ఆందోళన చేసిన  రైతు సంఘాలకు విపక్షాలు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.  


న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల Assembly Election ఎన్నికల్లో Farmer movement ఉద్యమం ప్రభావం ఏ మాత్రం కన్పించలేదు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఏడాదికి పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహించారు. Uttar Pradesh రాష్ట్రంలో BJP రెండో సారి అధికారంలోకి రానుంది. అయితే వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు ఉద్యమ ప్రభావం బీజేపీ విజయాన్ని నిలువరించలేకపోయిందని ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే అర్ధమౌతోంది. 

అయితే Three Farm Laws కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.ఈ సమయంలో రైతులకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని విపక్షాలు విమర్శించాయి.

Delhi సరిహద్దు కేంద్రంగా నిర్వహించిన రైతు ఉద్యమంలో ఎక్కువగా Punjab , హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో జాట్ రైతులు ఎక్కువగా ఉంటారు. అయితే బీజేపీ విజయాన్ని ఈ ఉద్యమం ఈ ప్రాంతంలో అంతగా ప్రభావం చూపలేకపోయింది. 

తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో రైతుల ఉద్యమ ప్రభావం ఏ మాత్రం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రైతు ఉద్యమానికి కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు మద్దతుగా నిలిచాయి. కానీ విపక్షాలకు ఆశించిన ఫలితాలు కూడా దక్కలేదు. పంజాబ్ లో ఆప్ విజయం సాధించడానికి ఇతర కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ పాలన ప్రబావం పంజాబ్ పై కన్పించింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసిన తప్పులు, ఆకాలీదళ్ ప్రాభవం కోల్పోవడం, బీజేపీకి నామ మాత్రమైన బలం ఉండడం కూడా ఆప్ వైపునకు ఓటర్లు మొగ్గు చూపారు. రైతు ఉద్యమానికి సంబంధించి కొందరు ఈ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఆశించిన పలితాలు రాలేదు.