మోడీ హత్యకు మావోల కుట్ర: పాపులారిటీ కోసమేనా?: కాంగ్రెస్

Assassination plot a Modi feature when his popularity dips: Congress leader Sanjay Nirupam
Highlights

మోడీపై కాంగ్రెస్ విసుర్లు


న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తరహాలోనే  నరేంద్ర మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని పూణే పోలీసులు విడుదల చేసిన లేఖపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ నిరుపమ్  స్పందించారు.  ఈ లేఖ పూర్తిగా అబద్దమని తాను అనుకోవడం కాదన్నారు. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్న కాలంలో కూడ ఇదే తరహలోనే ట్రిక్స్ ను ఉపయోగించాడని సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యానించారు.ఈ లేఖలు ఎంతవరకు నిజమో అని ఆయన అభిప్రాయపడ్డారు.పూర్తిస్థాయి విచారణ జరిగితే తప్ప వాస్తవాలు బయటకు రావన్నారు.  

ఈ విషయమై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు.దేశంలోని భద్రతాధికారులు తమ విధులను సక్రమంగానే నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. దేశంలోని నేతల రక్షించుకంటున్నారని భవిష్యత్తులో కూడ ఇదే కొనసాగిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

loader