చోరీ కేసులో నిందితుడి అరెస్టు కోసం వెళ్లిన పోలీసులు.. దాడి చేసిన గ్రామస్తులు.. ఎక్కడంటే?

అసోంలో పోలీసులు చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేయడానికి దొంగ స్వగ్రామం వెళ్లారు. వారు వెళ్లగానే ఆ నిందితుడి అరెస్టును అడ్డుకుంటూ స్థానిక యువత సిబ్బందిపై దాడికి దిగింది. వారి వాహనాన్నీ ధ్వంసం చేసింది.
 

assam police gets beaten up by local youth when they tried to arrest theft case accused kms

గువహతి: పోలీసులు ఓ చోరీ కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేయడానికి వెహికిల్‌లో బయల్దేరారు. ఆ పోలీసులు యూనిఫామ్‌లో లేరు. నిందితుడి గ్రామం మీదుగా వెళ్లుతుండగా.. ఆ గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. పోలీసులను చితకబాదారు. ఈ ఘటన అసోంలో శనివారం రాత్రి చోటుచేసుకున్నట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.

ఆఫీస్ ఇంచార్జీ భాస్కర్మల్లా పొటవారి సారథ్యంలోని రంగియా పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసుల బృందం నిందితుడిని అరెస్టు చేయడానికి వాహనంలో బయల్దేరారు. కామరూప్ జిల్లాలోని బరువాంజని ఆ నిందితుడి గ్రామం. పోలీసులు ఆ గ్రామానికి చేరుకోగానే స్థానికులు ఆగ్రహించారు. చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేయడాన్ని ఆ స్థానిక యువత అడ్డుకుంది.

పోలీసులను వారు చితకబాదారు. వారి వాహనంపైనా దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు యూనిఫామ్‌లో లేరు. అయినా, వారు తాము పోలీసులం అని చెప్పారు. కానీ, స్థానికులు వినిపించుకోలేదు. పోలీసు సిబ్బందిని గాయపరచడమే కాదు.. ఆ వాహనాన్నీ డ్యామేజ్ చేశారు.

Also Read: గాజా మీద న్యూక్లియర్ బాంబ్: ఇజ్రాయెల్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. పీఎం నెతన్యాహు ఏమన్నారంటే?

ఈ సమాచారం అందగానే కామరూప్ జిల్లా ఎస్పీ హితేశ్ రాయ్, సబ్ డివిజినల్ పోలీసు అధికారి సిజల్ అగర్వాల్‌లు వెంటనే అదనపు బలగాలతో స్పాట్‌కు చేరుకున్నారు. ఆ ఏరియాలో పోలీసులు మోహరించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కామరూప్ జిల్లాలో కలకలం రేపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios