అస్సామీ ముస్లింలు ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉన్నారు. మన దేశంలోని ఇతర ముస్లింలకు భిన్నమైన సంస్కృతిని, సంప్రదాయాలను వారు పాటిస్తారు. వారు ఇస్లాంను ఎంత నమ్ముతారో.. నియో వైష్ణవిజాన్నీ అంతే విశ్వసిస్తారు. మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు కూడా తమ మత విశ్వాసాలను ఎప్పటిలాగే కొనసాగిస్తారు. ఈ విధానాన్ని హిందూ, ముస్లిం సమాజాలు అంగీకరిస్తున్నాయి.
అసోంను తరుచూ శంకర్ - అజనోర్ దేశ్ (వైష్ణవ సాధువు, తాత్వికుడు శ్రీమంత శంకర్ దేవా, ఇస్లాం సూఫీ బోధకుడు అజాన్ ఫకీర్‌ల భూమి అని అర్థం) అని పిలుస్తారు. శతబ్దాల తరబడి భిన్న విశ్వాసాలు, భిన్న తెగల ప్రజలు కలిసి సామరస్యంగా నివసిస్తున్న భూమిగానూ అసోంకు పేరు ఉన్నది. ఈ గడ్డపై ముస్లింలు కీలక భాగంగా ఉంటారు. జమ్ము కశ్మీర్ తర్వాత అత్యధిక ముస్లిం జనాభా గల రాష్ట్రం అసోం. ఇక్కడ మొత్తం జనాభా 3.12 కోట్లలో సుమారు 34 శాతం మంది ముస్లింలే ఉన్నారు.
మన దేశంలోని మిగిలిన ముస్లింల కంటే అసోం ముస్లింలు భిన్నమైనవారు. ఒక ప్రత్యేక అస్తిత్వం కలిగి ఉన్నవారు. భిన్న సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తున్నారు. ఇందులో చాలా మంది అసోం తెగల వారే ఉన్నారు. ఉదాహరణకు కచారిలు, రాజ్‌బోంగ్షీలు, నాగాలు, మణిపురీలు, గారోలు, తేయాకు తెగలు ఉన్నారు. సయ్యద్‌లు, మోరియాలు అసోం ముస్లింలో ప్రధానంగా ఉన్నారు. వీరి పూర్వీకులు కూడా అసోం రాష్ట్ర మూలవాసులే.
పలు ముస్లిం సంఘాల ప్రకారం, రాష్ట్రంలో 1.23 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అసామీ మాట్లాడే ముస్లిలు 42 లక్షలు(35 శాతం), మిగిలినవారు బెంగాలీ మాట్లాడతారు. ఈ బెంగాలీ మాట్లాడే ముస్లింలు అసోం ముస్లిలతోనే కాదు, మిగిలిన భారతంలోని ముస్లింలతోనూ సంస్కృతిలో భిన్నంగా ఉంటారు. వీరికి రెండు మూలాలు ఉన్నాయి. ఒకటి వీరు బరాక్ వ్యాలీ నివాసులు, రెండు బ్రహ్మపుత్ర లోయలో నివసించి ఇక్కడికి వలస వచ్చినవారున్నారు.

అసోం ముస్లింల మూలాలు ఇక్కడి తెగల్లోనే ఉన్నాయి. వారు మిగిలిన భారత ముస్లింలకు భిన్నమైన సంస్కృతులు, సాంప్రదాయాలను పాటిస్తారు. ఆధ్యాత్మిక పూజల్లోనూ పాల్గొంటారు. చాలా వరకు అసోంలో పాటిస్తున్న సంప్రదాయాలను అవి హిందువులు పాటించేవైనా.. వీరూ పాటిస్తుంటారు. ఉదాహరణకు అసోం సమాజం పెళ్లి వేడుకల్లో కొన్ని శ్లోకాలు పాడుతుంటారు. అసోం ముస్లింలు కూడా ఆ శ్లోకాలు పాడుతారు.
కోచ్ రాజబోంగ్షీలు మత మార్పిడి చేసుకున్న ముస్లింలను దేశీలు అంటారు. వీరు తమ హిందు పూర్వీకులు పెళ్లి వేడుకల్లో పాటించిన తంతునూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సాధారణంగా ముస్లింలు పెళ్లి వేడుకల్లో మినహా డ్యాన్స్ చేయరు. కానీ, దేశీలు, గొరియాలు, మోరియాలు తమ హిందూ సోదరులతో కలిసి చిందులేస్తారు. తేయాకు తెగల నుంచి మతమార్పిడి చేసుకున్న జుల్హాస్ కూడా గిరిజనుల ఝుమర్ డ్యాన్స్‌లో పాల్గొంటారు.
Also Read: భారత్ నా దేశం; ఇస్లాం నా మతం
ఆహారపుటలవాట్లు కూడా ఇతర అసోంల తరహాలోనే అసోం మాట్లాడే ముస్లింలవి ఉంటాయి. గిరిజన మూలాలు గల వీరి స్పైసీ ఫుడ్‌నూ ఎంచుకరు. నాన్ స్పైసీ బిర్యానీ కుర్మా పులావ్‌ను జోహా రైస్, మీట్‌తో కలిసి తింటారు. వెజ్, నాన్ వెజ్ ఖర్ రెండూ ఒకే సమయంలో అసోం ప్రజలు తింటారు. ఇందుకు అసోం ముస్లింలకు కూడా మినహాయింపేమీ కాదు. హిందువులు, వెజ్ ఖర్ కావాలని కోరుకోగా.. ముస్లింలు దానికి ఫిష్ లేదా మీట్ కలుపుకుంటారు.
దుస్తులు, వేషధారణలోనూ ముస్లింల అసోంలు లిబరల్‌గానే ఉంటారు. హిజాబ్, బుర్ఖాలు తప్పనిసరేమీ కాదు. ఇక్కడి మహిళలు అసోం సాంప్రదాయమైన మేఖేలా, చాదర్‌ను ధరిస్తారు. చీరలూ కట్టుకుంటారు. ఇక్కడ ముస్లిం మహిళలు జీన్స్ ధరించడం, ప్యాంట్ వేయడంపై వారికి అభ్యంతరమేమీ లేదు.
ఇక్కడి ముస్లింలు ఈద్‌ను అలాగే పూజాలు కూడా వస్తాయి. వాటిలో ముస్లింల స్వయంగా పాల్గొంటారు. ఇస్లాంలో నిషేధితమైన విగ్రహారాధననూ వారు చేస్తారు. ముఖ్యంగా కామాఖ్య దేవతకు వారు వినమ్రంగా పూజలు చేస్తారు.
దుర్గా పూజా, సర్వస్వతి పూజా, విశ్వకర్మ పూజా, ఇతర దైవాల పూజల్లో అసోం ముస్లిం సభ్యులు క్రియాశీలకంగా పాల్గొంటారు. భాగస్వాములుగానూ ఉంటారు. ఖర్చులు భరిస్తారు. పూజల కోసం విరాళాలు ఇస్తారు. ఆస్తులనూ విరాళాలు ఇస్తున్నారు. కామాఖ్య దేవతలో అసోం ముస్లింలో సింహభాగం విశ్వాసం చూపిస్తారు. గువహతిలో నీలాచల్ కొండలపై గల శక్తిపీఠం వద్ద కూడా వారు పూజలు చేస్తారు.

అసోం ముస్లింలు ఇస్లాంతోపాటు నియో వైష్ణవాన్ని విశ్వసిస్తారు. ఈ రెండింటిలో తేడా ఉన్నదనీ ఎవరూ భావించరు. అజాన్ ఫకీర్, శ్రీమంత శంకర్ దేవాలు ఒకరే దేవుడు అని చెప్పారని, విగ్రహారాధనను మానుకోండని చెప్పారని వారు పేర్కొంటారు. అజాన్ ఫకీర్ బహుశా నియో వైష్ణవంతోనే ప్రేరణ పొంది ఉంటారని అసోం ముస్లింలు భావిస్తారు.
నయా వైష్ణవంపై వారికి ఎంత ఆరాదన అంటే.. అసోం ముస్లింలు స్వయంగా సత్రాలను ఏర్పాటు చేశారు. ముస్లిం పోలీసు అధికారి ముస్లే ఉద్దీన్ అహ్మద్ దేమాజీ జిల్లాలో లికాబలిలో నామగర్ నిర్మించారు. దాని ముందుగా ముస్లిం వెళ్లినా, హిందు వెళ్లినా మోకరిల్లి ప్రార్థించి వెళ్లుతారు.
తూర్పు అసోంలో ముస్లింలు కేవలం నయా వైష్ణవానికే పరిమితమయ్యారని చెప్పలేం. ఎందుకంటే వారు శివుడికీ ప్రాధాన్యత ఇస్తారు. బార్పేటా జిల్లా, కామరూప్ జిల్లాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
అసోంలో మతాంతర వివాహాలు సాధారణం. అయినా.. ఎవరి విశ్వాసాలు వారు కొనసాగించడంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. గతంలో మత మార్పిళ్లు జరిగేవి. కానీ, ఇప్పుడు అసోంలో దంపతులు ఒకరు ఇస్లాం, మరొకరు హిందూ మతం విశ్వాసాలను కలిగే ఉంటున్నారు. కాబట్టి, మత మార్పిళ్లు తగ్గిపోయాయి. ఇలా కొనసాగడంపై హిందూ సమాజం, ఇస్లాం సమాజం అభ్యంతరం చెప్పడం లేదు.
----ఇంతియాజ్ అహ్మద్
