దేశం, మతం ఈ రెండు దేనికదిగా సారూప్యత గల భిన్నమైన అంశాలు, అస్తిత్వాలు. చాలా మంది వీటిపై అవగాహన లేమితో అసంగత వాదనలు చేస్తారు. నా పూర్వీకులు ఈ దేశ బ్రాహ్మణులు. కానీ, మా తాత ఇస్లాం స్వీకరించి ఒక గొప్ప ఇస్లామిక్ స్కాలర్‌గా ఎదగడంలో ఆ విషయమేమీ ఆటంకం కలిగించలేదు.
దేశం, మతం అనే రెండు అస్తిత్వాల గురించి ఇటీవల నేను కొందరితో చర్చించాను. సమాజాలు, సంస్కృతులు, దేశాల గురించి వారికి ఉన్న జ్ఞానం ఏపాటిదో నాకు అర్థమే కాలేదు. అరబ్ ముస్లిం, టర్కిష్ ముస్లిం, మొరాకన్ ముస్లిం, ఫ్రెంచ్ ముస్లిం లేదా ఏ ఇతర దేశాల ముస్లింలు ఎంత సహజమో భారతీయ ముస్లింలు కూడా అంతే సహజం.
నేను కాలేజీ విద్యకు ప్రవేశించే వరకు నాకు ఈ రెండు అస్తిత్వాల గురించి ఎరుక లేదు. మా తాత ఒక ఇస్లామిక్ స్కాలర్. మా పూర్వీకులు గౌర్ బ్రాహ్మణులు అని ఎప్పుడూ చెబుతుండేవారు. అందుకే వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత గారా అని పిలిచేవారు. 1920 వరకు జాతీయోద్యమానికి విభజన రాజకీయాలు చేటు చేశాయనీ ఆయన చెప్పేవారు. పండిట్లు, హరిద్వార్లు చేతిలో వారి రికార్డు బుక్‌లతో గ్రామాలు తిరిగేవారని, మరణించిన పెద్దలకు తంతు నిర్వహించి డబ్బులు తీసుకునేవారనీ చెప్పారు.
మా పూర్వీకులు బ్రాహ్మణులు అని అంగీకరించే విషయం ఆయనను ఒక పవిత్ర ముస్లింగా కొనసాగడాన్ని అడ్డుకోలేదు. 90 ఏళ్ల వయసులోనూ ఆయన ప్రతి రోజు ఐదు సార్లు నమాజ్ చేసి రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసం ఉండేవారు. యూపీలోని గారా కమ్యూనిటీ గొప్ప ఇస్లామిక్ స్కాలర్లను, ప్రొఫెసర్లను తయారు చేసిందని గొప్పలు పోతుంటారు. ఈ కమ్యూనిటీవారు ఇస్లాంను విశ్వసిస్తూనే వారి మూలాలు భారత్‌లోనే ఉన్నాయని చెప్పడానికి సంకోచించరు. చాలా మంది తమ ఇంటి పేరుగా గౌర్‌నే కొనసాగిస్తుంటారు కూడా.
నా బాల్యం నుంచి పుందిర్, తోమర్, చౌదరి, త్యాగి వంటి ఇత్యాది ఇంటి పేర్లను నేను విన్నాను. వాటి మూలాలు అన్నీ భారత్‌లోనే ఉన్నాయి.
కానీ సోషల్ మీడియాలో కొందరు రైట్ వింగ్ ముస్లింలు, కొందరు రైట్ వింగ్ హిందువుల అభిప్రాయాలు, ప్రచారాలు చదివి బాధతో నేను ఇది రాస్తున్నాను. వారు ముస్లింలు అందరూ ఒకే జాతి, ఒకే దేశానికి చెందినవారని చెబుతున్నారు. కాబట్టి, వారి ఎట్టిపరిస్థితుల్లో వాస్తవ కోణంలో భారతీయులు కారని వాదిస్తున్నారు.
దియోబంద్ స్కూల్‌కు చెందిన ప్రముఖ ఉలేమా మౌలానా ఉబెయిదుల్లా సింధి తరుచూ ఒక మాట చెబుతారు. తన పూర్వీకులు హిందువులు అనే విషయం తాను ఒక ఇస్లామిక్ స్కాలర్ కాకుండా అడ్డుకోజాలదు. ఎవరైనా తనను అడిగితే తప్పకుండా తన తండ్రి రామ్ సింగ్, తాత జస్పత్ రాయ్ అని నిస్సంకోచంగా చెబుతాను. అవి నన్ను ఎప్పుడూ ఒక ప్రముఖ ఇస్లామిక్ స్కాలర్‌గా ఎదగడంలో ఆటంకాన్ని ఏర్పరచలేవు. భారత స్వతంత్ర సంగ్రామంలో ఎందరో ఇస్లామిక్ స్కాలర్లను మమేకం చేయడంలో ఆయన సఫలం అయ్యారు.
అంటే.. అరేబియా మూలాలున్న ముస్లింలు ఏమైనా తక్కువా? హిందుత్వను ఉద్బోధించిన వినాయక్ దామోదర్ సావర్కర్ ఇలా అంటారు.. ‘హిందువులు, మొహమ్మదీయుల మధ్య శత్రుత్వం గతకాలానిది. వారితో ప్రస్తుత సంబంధం.. పాలకులు-పాలితులు, విదేశీయులు-స్థానికులుగా లేదు, సోదరులుగా ఉన్నది. ఇద్దరూ హిందుస్తాన్ బిడ్డలే. వారి పేర్లు వేరు కానీ, ఒకే తల్లి బిడ్డలు; కాబట్టి, ఇండియా వీరిద్దరికీ జనని, అంటే వారిది రక్తసంబంధం’
Also Read: యూట్యూబ్‌లో నకిలీ ముల్లాల బోధనలు ప్రమాదకరం.. ఊహా ప్రపంచంతో వాస్తవ సమస్యలు పరిష్కృతమవుతాయా?
మా తాత మిత్రుల్లో ఒకరైన తావు పర్బు 1947లో విభజన తర్వాత ముజఫర్ నగర్‌కు వచ్చిన ఒక పంజాబీ హిందు. ఈ రెండు కుటుంబాలు ప్రతి పండుగలో కలుసుకునేవి. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకల్లో పాల్గొనేవి. తావు పర్బు కొడుకులు మా కుటుంబంతోనే ఉండేవారు. అతని ఇతర మిత్రులు జైన మతానికి చెందిన వ్యాపారస్తులు.
అన్నింటికంటే మానవత్వం మిన్న అని తాత చెప్పేవాడు. కానీ, ఈ రోజు సోషల్ మీడియాలో ఎందుకు ముస్లింలు అంతా 1947లో పాకిస్తాన్‌కు వెళ్లిపోలేదు అని ప్రశ్నిస్తుంటారు. ఇది మా తాతకు ఒక స్టుపిడ్ కొశ్చన్. ఎవరైనా ఎందుకు ఇల్లు వదిలి వెళ్లిపోవాలి? ఆ కాలంలో విభజనకు వ్యతిరేకంగా పోరాడిన మౌలానా హుసేన్ అహ్మద్ మాదినితో మా తాత ప్రభావితుడయ్యాడు. మతాన్ని దేశంతో పోల్చరాదని వారు చెప్పేవారు.
మీరు ఒక జాతీయవాద భారత ముస్లిమా? అని నన్ను ఎవరైనా అడిగితే, చాలా సందర్భాల్లో నేను సమాధానం ఇవ్వను. విశ్వాసంపై చర్చ చేయరాదని ఒక సీనియర్ ఇండియన్ పొలిటికల్ థింకర్ నాతో అన్నాడు. మన వైఖరి మార్చుకోవడానికి వీలుండే అంశాలపై చర్చ చేయాలి. కానీ, ఒకరి మతం, దేశం పట్ల ప్రేమ గురించి చర్చ చేసే అవకాశమే లేదు.
---సాఖిబ్ సలీం
