రెండో పెళ్లి చేసుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరి.. ప్రభుత్వ ఉద్యోగులకు అసోం ప్రభుత్వం ఆదేశాలు

అసోం ప్రభుత్వం సంచలన ఆదేశాలు తెచ్చింది. భాగస్వామి సజీవంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి మరో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని, ఒక వేళ వారి మతం అందుకు అనుమతించినా ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి.
 

assam govt employees not entitled to second marriage while partner alive kms

న్యూఢిల్లీ: అసోం ప్రభుత్వ ఉద్యోగులపై రెండో పెళ్లికి సంబంధించి ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. భార్య సజీవంగానే ఉన్నా రెండో పెళ్లి చేసుకోవాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఇద్దరు భార్యలూ పెన్షన్ కోసం వివాదానికి దిగుతున్న సమస్యలు అధికం అవుతున్నాయని, కాబట్టి, ఈ ఆదేశాలను కచ్చితత్వంతో అమలు చేస్తామని స్పష్టం చేశారు.

పర్సన్నల్ డిపార్ట్‌మెంట్ ఇందుకు సంబంధించి ఆఫీసు మెమోరాండం విడుదల చేసింది. ఇందులో విడాకుల షరతును ప్రస్తావించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ భార్య బ్రతికి ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని, అలాంటి సందర్భాల్లో రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ముందస్తుగానే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. భార్య సజీవంగా ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు కూడా భర్త సజీవంగా ఉండగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని భావిస్తే ముందస్తుగానే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని అందులో ఆదేశాలుఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌ను పర్సన్నల్ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ నీరజ్ వర్మ అక్టోబర్ 20వ తేదీనే విడుదల చేశారు. అయితే.. గురువారం ఆలస్యంగా ఈ ఆదేశాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: 14యేళ్ల బాలిక సాహసం.. తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి 34కి.మీ.లు రిక్షా తొక్కింది..

అసోం ప్రభుత్వ ఉద్యోగులు (భాగస్వామి బ్రతికి ఉండగానే)రెండో పెళ్లికి అనర్హులని, కొన్ని మతాలు అందుకు అనుమతించినా వారు ప్రభుత్వం నుంచి ముందస్తుగానే అనుమతి తీసుకోవాలని శర్మ వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios