14యేళ్ల బాలిక సాహసం.. తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి 34కి.మీ.లు రిక్షా తొక్కింది..

ఒడిశాలో ఓ 14 ఏళ్ల బాలిక గాయపడిన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి 34కి.మీ.లు రిక్షా తొక్కింది. 

14-year-old girl rode rickshaw for 34 km to take her father to the hospital In Odisha - bsb

ఒడిశా : ఒడిశాలో ఓ హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. ఓ 14యేళ్ల బాలిక 35 కి.మీ.లు రిక్షా తొక్కుతూ తండ్రిని ఆస్పత్రికి తీసుకువెళ్లింది. వాహనాన్ని మాట్లాడుకునేంత డబ్బులు లేకపోవడం..  అంబులెన్స్ కి ఫోన్ చేయడానికి ఫోన్ లేకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ సంఘటన అక్టోబర్ 23 న జరిగింది. అయితే రిక్షా కు ఉన్న ట్రాలీలో తన తండ్రిని ఇంటికి తీసుకెళ్తుండగా భద్రక్ పట్టణంలోని మోహతాబ్ చక్ సమీపంలో కొంతమంది స్థానికులు, జర్నలిస్టులు బాలికను గుర్తించడంతో గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. నడిగన్ గ్రామానికి చెందిన సుజాత సేథి (14) అనే బాలిక గాయపడిన తన తండ్రిని గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధామ్‌నగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి, తన తండ్రి ట్రాలీని తొక్కుతూ వెళ్లింది.

అమానుషం.. ఉదయాన్నే నిద్ర లేవలేదని, 12మంది మైనర్ విద్యార్థులకు వేడి స్పూన్ తో వాతలు..

అయితే, అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు భద్రక్ డీహెచ్‌హెచ్‌కి తరలించాలని తెలిపారు. అక్టోబర్ 23న తన తండ్రిని జిల్లా ఆసుపత్రికి తీసుకురావడానికి ఆమె ట్రాలీని 35 కిలోమీటర్లు తొక్కింది. అక్టోబర్ 22న జరిగిన గ్రూపు ఘర్షణలో ఆమె తండ్రి శంభునాథ్ గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

బాలిక సుజాత తెలిపిన వివరాల ప్రకారం, భద్రక్ డిహెచ్‌హెచ్‌లోని వైద్యులు ఆమెను అప్పటికి, తిరిగి వెళ్లిపోవాలని.. ఆపరేషన్ కోసం ఒక వారం తర్వాత రావాలని సూచించారు. దీంతో.. "నా వద్ద ప్రైవేట్ వాహనాన్ని అద్దెకు తీసుకోవడానికి డబ్బు లేదు. అంబులెన్స్‌కు కాల్ చేయడానికి మొబైల్ ఫోన్ లేదు. కాబట్టి, నేను మానాన్నను ఆసుపత్రికి తీసుకురావడానికి మా నాన్నతొక్కే ట్రాలీనే ఉపయోగించాను" అని చెప్పింది.

ఘటన గురించి సమాచారం అందుకున్న భద్రక్ ఎమ్మెల్యే సంజీబ్ మల్లిక్, ధామ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర దాస్ బాలిక వద్దకు చేరుకుని అవసరమైన సహాయం అందించారు. భద్రక్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO) శాంతాను పాత్ర మాట్లాడుతూ, రోగి అక్టోబర్ 23న చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. అయితే, వారం తర్వాత ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. రోగులు ఇంటికి తిరిగి వెళ్లడానికి అంబులెన్స్ సేవలు మా ఆస్పత్రికి లేదు. చికిత్స ముగిసే వరకు అతను ఆసుపత్రిలోనే ఉంటాడు" అని పాత్రా చెప్పారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios